Minister Uttam kumar reddy clarity on new ration card release: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. అదే విధంగా ప్రస్తుతం పద్దులపై కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చలు నడుస్తున్నాయి. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితికి అప్పటి బీఆర్ఎస్ కారణమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అదే రేంజ్ లో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్క లబ్ధి దారుడికి రేషన్ కార్డు, పథకాలు అందేలా చూస్తుందన్నారు. పేదలకు కూడా సన్న బియ్యం అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం చిత్త శుధ్దితో ఉందని, ప్రజలకు మంచి చేస్తామంటూ కూడా క్లారీటీ ఇచ్చారు. ఆగస్టు 1 క్యాబినెట్ భేటీ అవుతుందని,దానిలో విధివిధానాలను రూపొందిస్తామన్నారు. అందరి సూచనలు తీసుకుని, ప్రజలకు మేలు చేసేలా రేషన్ కార్డుపై సరైన నిర్ణయం తీసుకుంటామని కూడా మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.


గతంలో సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్.. సరైన విధంగా శాఖను నిర్వహించలేదన్నారు. అనేక లోటు పాట్ల వల్ల.. ఈరోజు పేదలకు సన్న బియ్యం అందించడానికి కష్టమౌతుందన్నారు. తాము మాత్రం ప్రజలకు సన్నటి బియ్యంతో పాటు.. అనేక పథకాలు అందేలా చూస్తామన్నారు. గతంలో చెప్పిన విధంగా బీపీఎల్ కు దిగువన ఉన్న వారికి అన్నిరకాల పథకాలు అందుతాయన్నారు.


Read more: Revanth Reddy: అక్కలు.. ఇక్కడ వాళ్లను ముంచే అక్కడ తేలారు.. సబిత పై పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్..


కొందరు అక్రమంగా రేషన్ కార్డులు సంపాదించి ప్రభుత్వంను మోసం చేశారన్నారు. ఇలాంటి రేషన్ కార్డుల్ని ఏరీవేసి నిజమైన లబ్ధి దారులకు మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter