Revanth Reddy Comments On Free Power To Farmers: ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను తీసివేసి 8 గంటలకు పరిమితం చేస్తామని ఆయన కామెంట్స్ చేయడంపై మంత్రులు ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనం చేయాలని నిర్ణయించింది. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని.. మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు.
 
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు  వెళ్లిపోయినా ఆయన  నీడలు జాడలు తెలంగాణలో మిగిలే  ఉన్నాయని  రేవంత్ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. 2004 పరిస్థితులను  20 ఏళ్ల తర్వాత గుర్తుకు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం  ఏర్పడిందన్నారు. 2004లో చంద్రబాబు  ఉచిత విద్యుత్‌పై ఏం మాట్లాడారో  రేవంత్  అదే  మాట్లాడారని అన్నారు. రేవంత్  చంద్రబాబు  శిష్యుడిని  వారసుడినని నిరూపించుకున్నారని విమర్శించారు. రేవంత్  ఉచిత విద్యుత్‌పై  మాట్లాడిన మాటలు రైతులపై పిడుగుపాటు లాంటివేనని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రైతాంగం  అన్నీ బాధల నుంచి శాశ్వత  విముక్తి అనుకుంటున్న తరుణంలో రేవంత్ రూపంలో  కొత్త బాధ  వచ్చిపడిందన్నారు. కాంగ్రెస్  నిజ స్వరూపం  ఏమిటో  రేవంత్  వ్యాఖ్యలతో బయట పడింది. గతం లో కూడా  కాంగ్రెస్  ఏడు గంటలు  కూడా  రైతులకు  కరెంటు  ఇవ్వలేక పోయింది. రైతుకు  మొదటి  శత్రువు  కాంగ్రెస్  పార్టీయే. తెలంగాణ  రైతాంగం  కూడా  రేవంత్  వ్యాఖ్యలపై  ఆలోచించుకోవాలి. అసలు  రేవంత్‌కు వ్యవసాయం  గురించి  అవగాహన  ఉందా..? ఎకరా పారాలంటే గంట  విద్యుత్  చాలట. మూడు  గంటలు  ఉచిత  విద్యుత్  చాలని రేవంత్  అంటున్నాడు. ఇక  కాంగ్రెస్  జెండా  పట్టుకున్న  రైతులు  ఆలోచించుకోవాలి.
 
గతం లో  కాంగ్రెస్  ఆరు  గంటలు  కరెంట్‌  ఇస్తే  రేవంత్  తదితర  టీడీపీ  నేతలే  కదా  ధర్నాలు  చేసింది. నీ  ఇంట్లో  24 గంటలు  కరెంటు  ఉండాలి.  ఏసీ బంద్ కావొద్దు. రైతులకు  మాత్రం  24 గంటలు  ఇవ్వోద్దా.. ఇదేం లాజిక్. రైతులంటే  కాంగ్రెస్‌కు ఇంత చిన్న  చూపా..? పెట్టుబడి దారులకు 24 గంటల  కరెంట్  ఉండాలి. రైతులకు  ఎందుకు ఉండకూడదు. ఎప్పుడంటే అపుడు  కరెంటే  ఆన్ చేసుకునే వెసలు బాటు రైతులకుండాలని కేసీఆర్  వ్యవసాయానికి 24 గంటలు కరెంటు సరఫరా చేయాలని  నిర్ణయించారు.


రేవంతే  కాంగ్రెస్‌ను ఖతం చేస్తారని  ఆ  పార్టీ  సీనియర్లు  అంటున్నారు. పొరపాటున  కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతులకు  పాము  తేలు కాట్లే గతి. రేవంత్  రెడ్డి  వ్యాఖ్యలు  వ్యక్తిగతం  కాదు. పీసీసీ అధ్యక్షుడిగా  మాట్లాడారు. కాంగ్రెస్  తప్పించుకునే  అవకాశం  లేదు. మూడు గంటల  ఉచిత  కరెంట్‌  సరిపోతుందని  అవగాహన  లేని  వాళ్లే మాట్లాడతారు. కాంగ్రెస్  తీరుపై  రేపు  రైతులతో పాటు  బీఆర్ఎస్  శ్రేణులు ఉద్యమిస్తాయి. రాహుల్ గాంధీయో వాళ్లు చెల్లెనో రేపు రాష్ట్రానికి  వచ్చి మూడు గంటల కరెంట్ ఇస్తామని  చెప్పినా  ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్‌ది రద్దుల బతుకు ఉచిత  విద్యుత్‌ను రేవంత్  చేస్తామంటున్నారు. యాదాద్రి  ప్లాంటును  రద్దు చేస్తామని ఎంపీ  కోమటి  రెడ్డి  అంటున్నాడు. రద్దుల కాంగ్రెస్‌ను  తెలంగాణ ప్రజలు  రద్దు  చేశారు. బీఆర్ఎస్  నేతలు  ఏ  పార్టీతో  టచ్‌లో  లేరు. ప్రజలంతా కేసీఆర్‌తో  టచ్‌లో  ఉన్నారు.." అని జగదీష్‌ రెడ్డి విమర్శించారు.


Also Read: David Warner: డేవిడ్ వార్నర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. చివరి మ్యాచ్ ఆడేశాడా..?  


Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి