Mission Bhagiratha: `మిషన్ భగీరథ` బంద్.. ఆ జిల్లాల్లో చుక్క నీరు లేదు!
తెలంగాణ జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ. సరఫరాలో ఏర్పడిన అడ్డంకుల కారణంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా మంచి నీటి సరఫరా ఆగిపోయింది.
Mission Bhagiratha: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మిషన్ భగీరథ నీటి సరఫరా ఇప్పుడు అడ్డంకి ఏర్పడింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా మంచి నీటి సరఫరాను అధికారులు ఆపేశారు. నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలానికి చెందిన మాడేగాం ఫిల్ట్ బెడ్డు దగ్గర అధిక వోల్టేజ్ కారణంగా కరెంట్ వైర్లు కాలిపోయాయి. దీంతో నిర్మల్ లోని 780 గ్రామాలతో సహా ఆదిలాబాద్ పరిసర 92 గ్రామాల్లో నీటి సరఫరా ఆగిపోయింది. ఈ క్రమంలో ఎస్ఆర్‌ఎస్‌పీ (SRSP) నుంచి పైపు లైను ద్వారా ఆయా గ్రామాలకు తాత్కాలికంగా మంచి నీటి సరఫరా చేస్తున్నారు.
మరోవైపు మాడేగాం వద్ద నుంచి వచ్చే నీరు నిలిచిపోవడంతో పవర్ సప్లై కేబుల్ కాలిపోవడం వల్ల ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ఆ గ్రామాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వేరే గత్యంతరం లేక ప్రజలు వారి వారి పాత బోర్లు, పాత ట్యాంకుల నీటి నిల్వలపై ఆధారపడ్డారు. గత మూడు రోజులుగా తాగునీటి ఎద్దడి వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సకాలంలో పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
సరైన వానలు లేక అతలాకుతలం అవుతున్న జనానికి ఈ తాగునీటి సరఫరా లేని కారణంగా మరింత ఆవేదనకు గురవతున్నారు. అధికారులే కావాలని నీటి సరఫరా ఆపేసినట్లు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజులు నుంచి ఈ నరకాన్ని అనుభవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు మరమ్మతు పనులు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చిట్టచివరి గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని పాత బోర్లు, నీటి ట్యాంకులు ఎండిపోయాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు తక్షణమే వేరే విధంగా తాగునీటి సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పనులు పునరుద్ధరణ జరుగుతాయని తమకు నమ్మకం లేదని వారు మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు.
Also Read: Xiaomi S3 Watch Price: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో Xiaomi S3 వాచ్..లీకైన ఫీచర్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook