Jagga Reddy: రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి సవాల్... సంచలన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో ప్రకంపనలు..
టీడీపీలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎవరెవరిని కలిశారు... ఎవరెవరిని ఎలా వాడుకున్నారన్నది బయటపెడుతానని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Jagga Reddy challenges Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని... రేవంత్ రెడ్డికి దమ్ముంటే తనకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలని సవాల్ చేశారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఒకవేళ సస్పెండ్ చేస్తే... రోజుకో బండారం బయటపెడుతానని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని అశోక హోటల్లో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినా సరే సోనియా, రాహుల్ గాంధీలకు తాను విధేయుడిగానే ఉంటానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయనుందనే ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ కూతురు ఒక డాక్టర్ అని.. ఆమెకు సంబంధించిన పని కోసం వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావును ఆయన కలిశారని అన్నారు. అందులో తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పుడు సదరు నేత ఎక్కడుంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుందన్నారు.
టీడీపీలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎవరెవరిని కలిశారు... ఎవరెవరిని ఎలా వాడుకున్నారన్నది బయటపెడుతానని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనతో అసెంబ్లీలో రేవంత్ ఏం మాట్లాడినది కూడా బయటకు వెల్లడిస్తానన్నారు. ఇవాళ జరిగిన కాంగ్రెస్ సీనియర్ల ప్రత్యేక భేటీ పార్టీ వ్యతిరేక కార్యక్రమం ఎంతమాత్రం కాదన్నారు.
కాంగ్రెస్ సీనియర్ల భేటీ జరుగుతున్న హోటల్ వద్దకు ఆ పార్టీ నేతలు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్ తదితరులు వెళ్లగా.. సున్నితంగా వారించి వారిని అక్కడి నుంచి పంపించేశారు.
కాగా, టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సీనియర్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. రేవంత్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని... ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పలు సందర్భాల్లో సీనియర్లు విమర్శించారు. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు, ఛాలెంజ్‌లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో రేవంత్, జగ్గారెడ్డి భేటీ అవడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లేనని అంతా భావించారు. కానీ ఇంతలోనే సీనియర్లు ప్రత్యేకంగా భేటీ అవడం... జగ్గారెడ్డి రేవంత్ రెడ్డికి సవాళ్లు విసరడం.. పార్టీలో ముసలం ముదురుతోందన్న సంకేతాలను పంపించినట్లయింది.
Also Read: Russia-Ukraine war: రష్యా దాడులకు వందల సంఖ్యలో ఉక్రెయిన్ చిన్నారులు బలి!
Also read: ఏడేళ్ల వయసులో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత ఆమెను చంపిన యువకుడు.. 101 సార్లు కత్తితో పొడిచి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook