ఏడేళ్ల వయసులో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత ఆమెను చంపిన యువకుడు.. 101 సార్లు కత్తితో పొడిచి..

Man kills teacher for humiliation: నిజానికి మరియా హత్య చాలా కాలం మిస్టరీగానే మిగిలిపోయింది. దోషులను పట్టుకునేందుకు పోలీసులు వందలాది మంది అనుమానితుల డీఎన్‌ఏ శాంపిల్స్‌‌ను పరిశీలించారు. అయినా హంతకుడెవరో తేల్చలేకపోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 05:42 PM IST
  • టీచర్‌ను హత్య చేసిన యువకుడు
  • చిన్నప్పుడు అవమానించిందని
  • ముప్పై ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వైనం
ఏడేళ్ల వయసులో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత ఆమెను చంపిన యువకుడు.. 101 సార్లు కత్తితో పొడిచి..

Man kills teacher for humiliation: పశ్చిమ యూరోప్ దేశం బెల్జియంలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఎప్పుడో చిన్నప్పుడు టీచర్ తనను అవమానించిందని.. ముప్పై ఏళ్ల తర్వాత ఆమెపై పగ తీర్చుకున్నాడో యువకుడు. ఒకానొక రోజు ఆమె ఇంటికి వెళ్లిన అతను కత్తితో ఆమెను కసితీరా 101 సార్లు పొడిచి హత్య చేశాడు. 2020లో ఈ హత్య జరగ్గా... ఆ తర్వాత 16 నెలలకు గానీ హంతకుడు ఆ యువకుడే అన్న విషయం తెలియలేదు.

ఆ హంతకుడి పేరు గంటర్ ఉవెంట్స్ (37). ప్రైమరీ స్కూల్లో తనకు చదువు చెప్పిన టీచర్ మరియా వెర్లిండన్‌(59)పై అతను ముప్పై ఏళ్లుగా పగతో రగిలిపోయాడు. కారణం.. చదువుకునే రోజుల్లో ఆమె క్లాసులో తనను అందరి ముందు ఆమె అవమానించిందని. నవంబర్ 20, 2020న అంట్వెర్ప్ సమీపంలోని హెరెంటల్స్‌లో ఉన్న మరియా ఇంటికి గంటర్ వెళ్లాడు. అదే రోజు మరియాను కత్తితో పొడిచి హత్య చేశాడు.

నిజానికి మరియా హత్య చాలా కాలం మిస్టరీగానే మిగిలిపోయింది. దోషులను పట్టుకునేందుకు పోలీసులు వందలాది మంది అనుమానితుల డీఎన్‌ఏ శాంపిల్స్‌‌ను పరిశీలించారు. అయినా హంతకుడెవరో తేల్చలేకపోయారు. మరియా హత్య జరిగిన 16 నెలలకు గంటర్ ఉవెంట్స్.. తన స్నేహితుడితో హత్యా నేరం అంగీకరించాడు. షాక్‌కి గురైన ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.

గంటర్ ఉవెంట్స్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏడేళ్ల వయసులో తాను విద్యార్థిగా ఉన్నప్పుడు టీచర్ మరియా తనను అవమానించిందని చెప్పాడు. అప్పటినుంచి ఆమెపై పగ పెంచుకుని ముప్పై ఏళ్ల తర్వాత హత్య చేసినట్లు తెలిపాడు. 101 సార్లు ఆమెను కసితీరా పొడిచి చంపినట్లు చెప్పాడు.

మరియా హత్య ఘటనపై ఆమె సోదరి లుత్ వెర్లిండన్ మాట్లాడుతూ.. ఈ ఘటన తనను షాక్‌కి గురిచేసినట్లు తెలిపారు. ఒకప్పుడు తన సోదరితో పాటే లుత్ కూడా అదే స్కూల్లో టీచింగ్ చేశారు. ఆ సమయంలో తనతో పాటు పనిచేసినవారెవరికీ మరియా, గంటర్‌ను అవమానించిన విషయమేమీ గుర్తులేదన్నారు. నిజానికి గంటర్ ఒక అంతర్ముఖుడు అని.. ఎవరితోనూ మాట్లాడే రకం కాదని అన్నారు. అతను ఇంత పనిచేస్తాడని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యోదంతం బెల్జియంలో సంచలనం రేపింది.

Also Read: IND vs AUS: మెగ్ లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సెమీస్‌కు ఆసీస్! ఇక టీమిండియాకు చావోరేవో!!

Also Read: Penny Song Promo: సర్కారు వారి పాట సెకండ్‌ సింగిల్‌ ప్రోమో ఔట్.. సూపర్ స్టార్ అభిమానులకు 'సూపర్ సర్ప్రైజ్'!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News