MLA Pilot Rohith Reddy Clarity on ED Notices: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఇప్పుడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. రోహిత్ రెడ్డి చేస్తున్న వ్యాపార ఆర్థిక లావాదేవీల పై ఈడీ విచారణ జరపబోతున్నట్లుగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానికి సంబంధించిన నోటీసులు ఆయనకు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పైలెట్ రోహిత్ రెడ్డి కూడా నిర్ధారించారు. తన, తన కుటుంబ సభ్యుల వ్యాపార ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు తీసుకురమ్మని నోటీసుల్లో పేర్కొన్నారని అయితే ఏ కేసు మీద ఈ నోటీసులు ఇచ్చారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈరోజు పొద్దున ఈడి నోటీసులు ఇచ్చారని అయితే ఈ నోటీసులు చూస్తుంటే చమత్కారంగా ఉందనిపిస్తోందని పేర్కొన్నారు.


ఈ నోటీసులలో ఎలాంటి కేసు వివరాలు లేకుండానే ఇచ్చారని ఆ నోటీసులలో నా బయోడేటా మాత్రమే అడిగారని పేర్కొన్నారు. అసలు ఈ నోటీసుల్లో బయోడేటా అడగడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మాకు నోటీసులు ఇస్తారని బండి సంజయ్ ముందే చెప్పారని నాకు నోటీసులు ఇస్తారని ఆయనకు ఎలా ముందే తెలుసని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొనుగోళ్ళ కేసులో బీజేపీ గుట్టు రట్టు చేసినందుకే ఈ నోటీసులు ఇచ్చారని పేర్కొన్న ఆయన తెలంగాణ అభివృద్ధి చూడలేక కక్ష సాధింపు చర్యలకు బిజెపి పాల్పడుతోందని విమర్శించారు.


ఈడి నోటీసులకు భయపడేది లేదన్న ఆయన వెనక్కి తగ్గేది కూడా లేదని అన్నారు. ఈ నోటీసుల విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నానని అది తీసుకున్న తర్వాత దాని ప్రకారం నడుచుకుంటానని అన్నారు. కర్ణాటక డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని పేర్కొన్న ఆయన  డ్రగ్ కేసులో నా పేరును బండి సంజయ్ ప్రస్తావించారు,  బండి సంజయ్ కు సవాల్...నాకు కర్ణాటక కేసులో నోటీసులు వచ్చాయా ? తడి బట్టలతో ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.


తడి గుడ్డలతో యాదగిరిగుట్టలో ప్రమాణం చేయడానికి బండి సంజయ్ సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. మతం పిచ్చితో బిజెపి ప్రజలను మభ్యపెడుతోందని ఈడీ, సీబీఐ, ఐటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని రోహిత్ రెడ్డి అన్నారు. ఈ నోటీసులు అంశంపై బండి సంజయ్ మీద కేసు వేస్తానని పేర్కొన్న ఆయన బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అసలు ఆదాని, అంబానీలకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించిన రోహిత్ రెడ్డి యాదగిరిగుట్టకు తడి గుడ్డలతో ప్రమాణం చేసేందుకు ఎప్పుడు వస్తారో డేట్ చెప్పాలని అన్నారు.


బీఎల్ సంతోష్ తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు సహకరించడం లేదని ప్రశ్నించిన ఆయన బండి సంజయ్ గుండు ఎంత ప్లెయిన్ గా ఉందో ఈడీ నోటీసులు కూడా అంతే ప్లెయిన్ గా ఉన్నాయని విమర్శించారు. నాపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్న ఆయన, ఎలాంటి నిధులు వ్యవహారాలు కూడా తాను చేయలేదని అలాగే బెంగళూరు డ్రగ్స్ కేసులో కూడా తనకు ఈ నోటీసులు ఇవ్వలేదని మరోమారు క్లారిటీ ఇచ్చారు.  


Also Read : Upasana Surrogacy : సరోగసి ద్వారా బిడ్డను కంటోన్న ఉపాసన.. అసలు మ్యాటర్ ఇదా?


Also Read : ED Notice to Rakul Preet : డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook