MLC Kavitha Arrest to Bail Full Details: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బిగ్ రిలీఫ్‌ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. ఆమె దాదాపు 164 రోజులపాటు జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ కోసం బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించినా.. వివిధ కారణాలు చెబుతూ కోర్టులు బెయిల్‌ను తిరస్కరించాయి. బెయిల్ కోసం మరోసారి కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బెయిట్ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌ విచారణ చేపట్టింది. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. సీబీఐ, ఈడీ తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఎట్టకేలకు కవితకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపింది. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Senior Citizen Saving Scheme: రిటైర్‎మెంట్ తర్వాత నెలకు రూ. 20 వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ స్కీంలో చేరండి  


కవిత ఎలా అరెస్ట్ అయ్యారు..? ఏం జరిగింది..?


2022 జులైలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లైను సీబీఐ అరెస్ట్ చేసి వాంగ్మూలం నమోదు చేసింది. అతని వాంగ్మూలం ఆధారంగా కవితకు నోటీసులు పంపించింది. ఆ తరువాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ మద్యం టెండర్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని కేసు నమోదు చేసి.. కవితకు నోటీసులు పంపించింది. ఆ తరువాత పలుమార్లు విచారించి.. మార్చి 15న కవిత ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా కవితను సీబీఐ విచారించింది. లిక్కర్ స్కామ్‌లో సీఆర్‌పీసీ 160 కింద 7 గంటల పాటు వాంగ్మూలం నమోదు చేసింది. ఈడీ, సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కవిత పేరు ప్రస్తావించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద ఈడీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. 


అంతకుముండు జనవరి 5న కవితకు ఈడీ నోటీసులు పంపించగా.. మహిళను వ్యక్తిగతంగా విచారానికి పిలవడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్‌లో ఫిబ్రవరి 21న కవితకు సీబీఐ కూడా నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. తొలిసారిగా నిందితురాలుగా చేర్చింది. అదేసమయంలో సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉందని.. తాను రాలేనని కవిత రిప్లై ఇచ్చారు. ఆ తరువాత ఈడీ నోటీసులు ఇవ్వడం.. కవితకు విచారణకు హాజరు అయ్యారు. మార్చి 15న కవితను అరెస్ట్ చేసి.. తీహార్‌ జైలుకు తరలించారు. దాదాపు 164 జైలు జీవితం గడిపిన కవిత.. ఎట్టకేలకు బెయిల్‌పై నేడు బయటకు రానున్నారు. మధ్యలో ఆమె పలుమార్లు అనారోగ్యానికి గురై చికిత్స కూడా తీసుకున్నారు. 


Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.