MLC Kavitha: జాతీయ రాజకీయాలపై కొన్ని రోజులుగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సోషల్ మీడియా వేదికగా ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ, జేపీ నడ్డా, అమిత్ షాలకు పలు ప్రశ్నలు సంధించారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. దేశంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే హవా సాగోబోతుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధిపై లోకల్ పార్టీలకే స్పష్టమైన అజెండా ఉంటుందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి.. కాని జాతీయ పార్టీలు అలా ఆలోచన చేయవని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాంతీయ పార్టీల విషయంలో రాహుల్ గాంధీ అవగాహన పెంచుకుంటే మంచిదని సూచించారు. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న విషయం రాహుల్ గాంధీ గుర్తుంచుకుంటే మంచిదన్నారు. మహరాష్ట్ర సహా చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ... తోక పార్టీలా మారిపోయిందన్నారు. త్వరలోనే జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ తోక పార్టీలా ఉండటం ఖాయమన్నారు. దేశ రాజకీయాల్లో ఇకపై ప్రాంతీయ పార్టీలో కీలకంగా మారబోతున్నాయని కవిత చెప్పారు. సమర్థవంతమైన పాలన పాలన అందించాం కాబట్టే రెండోసారి తమను గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుందని కవిత అన్నారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా కవిత మండిపడ్డారు. ఆదిలాబాద్ లోని సిమెంట్ ఫ్యాక్టరీ సీసీఐని అమ్మేందుకు సిద్ధమైందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ బీజేపీ ఏమంటారని ప్రశ్నించారు.  సింగరేణి బొగ్గు గనులను అమ్మగా వచ్చే డబ్బులను తెలంగాణలోనే  వినియోగిస్తారా అని నిలదీశారు. దీనిపై కేంద్రాన్ని అడిగే ధమ్ము తెలంగాణ బీజేపీ నేతలకు ఉందా అని కవిత సవాల్ చేశారు. దేశ వ్యాప్తంగా ప్రైవేట్ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన మోడీ సర్కార్.. ఆ నిధులతో ఏం చేయబోతుందో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తారా ... పాలమూరు ప్రాజెక్టును జాతీయ హోదాగా ప్రకటించి.. ఆ నిధులను ఇస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాకర్టీని అమ్మేస్తే వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు ఎమ్మెల్సీ కవిత.


READ ALSO: Kcr On Dalitha Bandhu: దళిత బంధుపై కేసీఆర్ సంచలన నిర్ణయం..


READ ALSO: TRS Rajyasabha Names:పెద్దల సభకు ముగ్గురు వ్యాపారవేత్తలే.. చివరి నిమిషంలో కేసీఆర్ ట్విస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook