Kcr On Dalitha Bandhu: దళిత బంధుపై కేసీఆర్ సంచలన నిర్ణయం..

Kcr On Dalitha Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక దళిత బంధు పథకం. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధును ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేశారు. ఆ నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు మొత్తం దళిత బంధు అమలు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 06:05 PM IST
  • దళిత బంధు అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • నియోజకవర్గంలో 1500 మందికి దళిత బంధు
  • వరి కొనుగోళ్లు స్పీడప్ చేయాలని కేసీఆర్ ఆదేశం
Kcr On Dalitha Bandhu: దళిత బంధుపై కేసీఆర్ సంచలన నిర్ణయం..

Kcr On Dalitha Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక దళిత బంధు పథకం. హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధును ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేశారు. ఆ నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు మొత్తం దళిత బంధు అమలు చేశారు. తర్వాత నియోజకవర్గంలో 100 మందిని ఎంపికి చేసి స్కీమ్ అమలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 100 మంది లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అందరికి ఇస్తామని చెప్పి.. నియోజకవర్గంలో వంద మందికే పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దళిత బంధు అమలుకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 15 వందల మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళిత బంధు ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. లబ్దిదారులను ఎంపికి చేసిన తర్వాత దశల వారీగా స్కీమ్ కింద వచ్చే సాయం అందించాలని సూచించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దళిత బంధు అమలులో మరింత వేగం పెంచాలన్నారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పథకం అందించేవరకు దళిత బంధును కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

జూన్ 2 నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపైనా సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. గతంలో మాదిరే  నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు జరపాలని నిర్ణయించారు.కొవిడ్ కారణంగా గత రెండేళ్లు ఘనంగా జరపలేకపోయామని.. ఈసారి వైభవంగా జరపాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఉదయం తొమ్మిది గంటలకే వేడుకలు ప్రారంభించి.. మధ్యాహ్నం లోపే ముగించాలని కేసీఆర్ సూచించారు. గత ఎనిమిది ఏళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతికి సంబంధించిన నివేదికలు తయారు చేయాలని, ప్రసంగాల్లో వాటిని పొందుపరచాలని ఆదేశించారు. సమగ్రంగా రూపొందించిన ప్రసంగ ప్రతులను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించాలని సూచించారు. రవీంద్రభారతితో అన్ని జిల్లా కేంద్రాల్లో సాయంత్రం కవి సమ్మేళనాలు జరపాలని సూచించారు. తెలంగాణ ఘనత చాటేలా కవితలను కవులు,రచయితల నుంచి సేకరించాలన్నారు సీఎం కేసీఆర్.

ఇక వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేసిన కేసీఆర్.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని, రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వరిధాన్యం కొనుగోళ్లపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్.  చివరి గింజ వరకు కొంటామని, ఈ విషయాన్ని రైతులకు చెప్పాలని సూచించారు. వరి ధాన్యం విషయంలో కేంద్రం చిల్లరగా వ్యవహరించిందన్న కేసీఆర్.. ఎంత ఖర్చైనా భరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

READ ALSO: TRS Rajyasabha Names:పెద్దల సభకు ముగ్గురు వ్యాపారవేత్తలే.. చివరి నిమిషంలో కేసీఆర్ ట్విస్ట్

READ ALSO: Dist Name Change:దిగొచ్చిన సీఎం జగన్! ఆ జిల్లా పేరు మారింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News