Teenmaar mallanna: రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న.. నిరుద్యోగుల కోసం ఏకంగా సీఎంరేవంత్ రెడ్డికి..
DSC Exam: కొన్నిరోజులుగా నిరుద్యోగులు తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ఒకవైపు డీఎస్సీ ఎగ్జామ్ లు పోస్ట్ చేయాలంటూ నిరసలను తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 1,గ్రూప్ 2 అభ్యర్థులు కూడా పలు డిమాండ్లతో నిరసనలు తెలియజేస్తున్నారు.
MLc Teenmaar Mallanna React On Unemployment Issues: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారుకు కొన్నిరోజులుగా నిరుద్యోగుల నుంచి అనేక విధాలుగా నిరసలను ఎదురౌతున్నాయి. ఇప్పటికే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాము ప్రకటించిన నోటీఫికేషన్ లకు,సీఎం రేవంత్ నియామక పత్రాలు ఇస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు. అవన్ని తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ 1 అభ్యర్థులు తమ డిమాండ్లను తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచిన తర్వాత ఎగ్జామ్ లు పెట్టాలంటూ కూడా అభ్యర్థులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
Read more: Snake: పిల్లపామే కదా అని నోట్లో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.?.. వీడియో వైరల్..
అదే విధంగా.. రేవంత్ ఎన్నికల సమయంలో భారీగా పోస్టులు పెంచుతామంటూ, ఇప్పుడు మాట మార్చారంటూ కూడా నిరుద్యోగులు అనేక మంది నేతలను కలుస్తూ, తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు కేటీఆర్ ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కూడా మోతాలాల్ ఇప్పటికే ఎలాంటి ఆహరం తినకుండా ప్రొటెస్ట్ తెలియజేశాడు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు, బీజీపీ, బీఆర్ఎస్ సైతం నిరుద్యోగులకు తమ మద్దతు తెలిపాయి. మరోవైపు.. తెలంగాణలో డీఎస్సీ ఎగ్జామ్ లను మూడు నెలలపాటు వాయిదా వేయాలంటూ కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దీనిలో భాగంగా.. ఇప్పటికే అనేక మంది నేతల్ని కలిశారు. ఈక్రమంలో రేపు (శుక్రవారం) విద్యార్థి సంఘాలు, సంఘీభావం ప్రకటించిన పార్టీలతో కలిసి ప్రొటెస్ట్ ను తెలియజేస్తున్నట్లు నిరుద్యోగులు ఒక ప్రకటనలో వెల్లడించారు.. ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న డీఎస్సీ అంశంపై సానుకూలంగా స్పందించారు. డీఎస్సీ అభ్యర్థులు తీన్మార్ మల్లన్న ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. అయితే..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దీనిపై, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read more: Snake bite: నాగు పాముకు చుక్కలు చూపించిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
దీనిపై సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారో అనే దానిపై ఆసక్తికర చర్చనడుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ నిరుద్యోగుల వైపు.. సీఎంకు లేఖ రాయడం రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.అయితే.. దీనిపై ఈరోజు రాత్రి, లేదా రేపు ఏదైన ప్రకటన వెలువడోచ్చని కూడా రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. తీన్మార్ మల్లన్న తమకు మద్దతుగా నిలవడంతో నిరుద్యోగులు సైతం.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి