హైదరాబాద్: నేడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్స్‌లోకి మొబైల్ ఫోన్లను అనుమతించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌ కుమార్‌ స్పందించారు. శుక్రవారంనాటి పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడంపై గురువారం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మీడియా అడిగిన పలు సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్స్‌లోకి సెల్ ఫోన్లను అనుమతించకపోవడం గురించి స్పందిస్తూ.. ఓటు అనేది రహస్యంగా, స్వతంత్రంగా వినియోగించుకునే రాజ్యాంగ హక్కు. ఎవరు, ఎవరికి ఓటు వేశారనే ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే పోలింగ్ బూత్స్‌లోకి కెమెరాలను నిషేధించాం. సెల్‌ఫోన్లలో కూడా కెమెరాలు ఉన్నందున ఫోన్లను నిషేధించాం అని రజత్ కుమార్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించటానికి ఈసీ విధించిన పలు నిబంధనల్లో ఇదీ ఒకటని.. అందుకు ఓటర్లు సైతం సహకరించాలని రజత్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.