Telangana Assembly Elections And One Nation One Election Policy : దేశంలో మన తెలంగాణతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ' వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ' అనే పాలసీని మరోసారి తెరపైకి తీసుకొచ్చేందుకు మోదీ సర్కారు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. అందుకోసమే కేంద్రం సెప్టెంబర్లో ప్రత్యేకంగా పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది అనేది ఆ వార్తల సారాంశం. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందనగా కేంద్రం ఇలా స్పెషల్ సెషన్స్ నిర్వహించడానికి కారణం ఇదేననే టాక్ బలంగా వినిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పాలసీని ప్రవేశపెట్టే ఆలోచనలో భాగంగానే జమిలి ఎన్నికల బిల్లు కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో సెప్టెంబర్ 18 నుంచి 22 తేదీ వరకు పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ కి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవేళ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా నిజంగానే లోక్ సభ ఎన్నికలతో పాటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లయితే.. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా ఇప్పుడప్పుడే వెంటనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది.


ఎందుకంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ముగిసేందుకు వచ్చే ఏడాది మే నెల వరకు గడువు ఉంది. కానీ తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరం రాష్ట్రాల్లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే.. ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలకు కాల పరిమితి పెంచి లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. లేదంటే కేంద్ర ప్రభుత్వం గడువుని కుదించుకుని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు జరిపే అవకాశం కూడా లేకపోలేదు. 


ఐతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు కూడా జరపడం అనేది సిబ్బంది సర్దుబాటు పరంగా చూసుకున్నా.. లేదా భద్రతా పరమైన కారణాలతో చూసుకున్నా.. మరో విధంగా చూసుకున్నా కత్తిమీద సాములాంటిదే అవుతుంది కనుక కేంద్ర ప్రభుత్వం గడువు ముగిసే వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే కానీ జరిగితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు లేకపోలేదు. 


అభ్యర్థుల సర్దుబాటుతో పార్టీలకు తలనొప్పి..
ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే సందర్భంలో ఆ ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంలో ఒక స్వేచ్ఛ ఉంటుంది. అదేంటంటే.. ఎవరికైనా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోతే.. వారికి లోక్ సభ ఎన్నికల్లో సీటు ఇస్తామని రాజకీయ పార్టీలు చెప్పి నచ్చచెప్పేందుకు అవకాశం ఉంటుంది. లోక్ సభ ఎన్నికల్లో వారికి సీటు ఇచ్చినా... లేదా ఇవ్వకపోయినా.. లోక్ సభ సీటు బూచి చూపించి ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల్లో వారి నుంచి తిరుగుబాటు జండా ఎగురవేసే ప్రమాదం లేకుండా గండం గట్టెక్కించుకోవచ్చు.


ఇది కూడా చదవండి : YS Sharmila: కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనానికి గ్రీన్‌సిగ్నల్..! వైఎస్ షర్మిల డిమాండ్స్ ఇవే..


కానీ ఒకేసారి అసెంబ్లీకి, లోక్ సభకు ఎన్నికలు జరిగితే.. అలా ఎమ్మెల్యే ఆశావహులకు లోక్ సభ సీటు ఆశ చూపించి తప్పించుకోలేరు. లోక్ సభ సీటు ఇస్తాం అని చెబితే.. ఇక ఇవ్వక తప్పని పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ కంటే ఎంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించుకుని ఆశావహులను అసంతృప్తికి గురిచేస్తోన్న బీఆర్ఎస్ లాంటి పార్టీలకు ఒక రకంగా ఇది ఇబ్బందికరమైన పరిణామం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా జమిలి ఎన్నికలతో రాజకీయ పార్టీలకు ఉండే ప్రయోజనాలు ఉంటాయి.. అలాగే నష్టాలు కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణను మా ఎడిటర్ భరత్ అందిస్తారు.



ఇది కూడా చదవండి : CM KCR's Sisters Ties Rakhi: సీఎం కేసీఆర్ ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు.. సోదరీమణులకు పాదాభివందనం ఫోటోలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి