Mood Of The Nation poll: తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి (Telangana elections) రెండవ సారి విజయం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత టీఆర్​ఎస్​ పార్టీ ఎదరులేని శక్తిగా ఎదుగుతున్న సమయంలో.. బీజేపీ నుంచి గట్టి (Telangana BJP) పోటీ ఎదురైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని జీహెచ్​ఎసీ ఎన్నికల వరకు బీజేపీ అనుకోని విధంగా పుంజుకుంది. దుబ్బాక సహా గత ఏడాది జరిగిన హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​పై ఘన విజయం సాధించి (Huzurabad by election) సత్తా చాటుకుంది.


అయితే ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఓ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.


ఇండియా టుడే- సీ ఓటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో (Mood Of The Nation poll 2022) నిర్వహించిన.. ఇటీవలి సర్వేలో తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నట్లు తెలిసింది. అయితే బీజేపీ పుంజుకోవడం కాంగ్రెస్​కు మాత్రమే కాదు.. అధికా టీఆర్​ఎస్​కు గట్టి ఎదురు దెబ్బేనని సర్వే అంచనా (C Voter India Today Survey) వేసింది.


ఎన్నికలు వస్తే.. బీజేపీ హవా..


రాష్ట్రంలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ 6 లోక్ సభ సీట్లను గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఇక టీఆర్ఎస్ (TRS Party)​ 8, కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంటాయని (MOTN survey) తెలిపింది.


2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. బీజేపీ 2  సీట్లు అదనంగా గెలుస్తుందని.. టీఆర్​ఎస్​, కాంగ్రెస్​లు ఒక్కో సీటు కోల్పోయే అవకాశముందని సర్వే అభిప్రాయపడింది.


ముందస్తు ఎన్నికలు వస్తాయా?


సర్వేల మాట అటుంచితే.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై స్పందించడం గమనార్హం.


గతంలో కూడా 2019లో జరగాల్సిన ఎన్నికలను.. 2018లోనే జరిగిన విషయం (Early elections in Telangana) తెలిసిందే.


Also read: Telangana: తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు... పెరగనున్న భూముల ధరలు


Also read: Telangana Covid Tests: TRS సర్కార్ ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది: సోషల్ మీడియాలో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook