Telangana: తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు... పెరగనున్న భూముల ధరలు

గతేడాది జులైలో తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. ఏడాది గడవక ముందే ప్రభుత్వం మరోమారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం చర్చనీయాంశంగా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 11:47 AM IST
  • తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు
  • భూముల విలువను సవరించనున్న సర్కార్
  • ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే ఛాన్స్
Telangana: తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు... పెరగనున్న భూముల ధరలు

Telangana govt to hike Registration charges: తెలంగాణ ప్రభుత్వం మరోసారి రిజిస్ట్రేషన్‌ ఛార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ మూల ధరలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలిచ్చింది. ఆర్డీవోల నేత్రుత్వంలోని కమిటీలు దీనిపై కసరత్తు చేసి భూముల ధరలపై నాలుగైదు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువను 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్ట్‌మెంట్ల విలువను 25 శాతానికి పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు సమర్పించే ప్రతిపాదనలపై సమీక్ష జరిపి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది. పెరిగిన ధరలు, అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 

గతేడాది జులైలో తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. ఏడాది గడవక ముందే ప్రభుత్వం మరోమారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది వ్యవసాయ భూముల కనీస ధరను ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ ధరను 50 శాతానికి, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30 శాతానికి, మధ్య శ్రేణి భూముల ధరను 40 శాతానికి పెంచింది. అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది.

ప్రస్తుతం తెలంగాణలో (Telangana) ఏ మారు మూలకు వెళ్లినా ఎకరా రూ.25 లక్షలకు తక్కువ లేదు. ప్రభుత్వం మరో మారు భూముల విలువ పెంచేందుకు సిద్ధమవుతుండటంతో భూముల ధరలకు మరోసారి రెక్కలు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరగనుంది. ధరల పెంపుతో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.4500 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.

Also Read: ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇండియన్ బిజినెస్ టైకూన్ ఎవరో గుర్తుపట్టగలరా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News