Telangana Covid tests : తెలంగాణలో కొవిడ్ పరీక్షలు తగ్గించారని దీంతో కొవిడ్ కేసులు తక్కువగా చూపెడుతున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అందుకు సాక్ష్యం గత మూడు రోజుల కొవిడ్ రిపోర్ట్‌లు, టెస్టులే అంటూ పోస్ట్ చేశారు. కొవిడ్ టెస్ట్‌లు (Covid tests) తగ్గించి, కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళిసై జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక ఈ పోస్టులపై పలువురు నెటిజెన్స్ స్పందిస్తున్నారు. కొందరు ఈ పోస్టులను సమర్థిస్తున్నారు. తెలంగాణలో (Telangana) కొవిడ్ టెస్ట్‌లు తగ్గాయని, దాంతో కరోనా కేసులు పెరగడం లేదంటూ పేర్కొంటున్నారు.
Unbelievable fraud on the People of Telangana .. kindly see three days of Testing Numbers 🤦🏻… TRS Sarkar playing with Telangana peoples lives …. #COVID19 death bogus numbers … now #COVID19 Testing reduced .. will Excellency Governor @DrTamilisaiGuv madam intervene? pic.twitter.com/8HazJbapTz
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) January 20, 2022
ఇక తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ టెస్టుల (RTPCR Tests) సంఖ్య పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్షదాకా ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయాలంటూ సూచించింది. అలాగే ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాంటూ హైకోర్టు ఆదేశించింది.
అలాగే భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలంటూ, కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమంటూ హైకోర్టు పేర్కొంది. ఇక రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు జనవరి 20 వరకు పొడిగిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆంక్షలను మళ్లీ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) పొడిగించే అవకాశం ఉంది.
Also Read : Pushpa Dialogue video: కిలి పాల్ నోట పుష్ప ఫ్లవర్ డైలాగ్.. నీయవ్వ తగ్గేదెలే!
ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం 1,20,215 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. కొత్తగా 4,207 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,22,403కి చేరింది. అలాగే గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కొవిడ్‌తో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కొవిడ్ (Covid) వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,067కి చేరింది. కొవిడ్ నుంచి తాజాగా 1,825 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read : Corona Third wave: తండ్రీకొడుకులైన స్టార్ హీరోలకు వారం గ్యాప్‌లో కొవిడ్ పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook