Mother along with 9 months old child suicide in Midjil Mahabubnagar district : తొమ్మిది నెలల పసిబిడ్డతో పాటు చెరువులోకి దూకి ఓ తల్లి తనువు చాలించింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని (Mahabubnagar district) మిడ్జిల్‌ మండల కేంద్రంలో జరిగింది. మిడ్జిల్‌కు (Midjil) చెందిన వివాహిత సరిత (20) (Sarita) రెండు రోజుల క్రితం తన కూతురును తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఎంతకూ తిరిగిరాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో తల్లీబిడ్డ కోసం కుటుంబ సభ్యులు,బంధువులు ఎంతో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసు స్టేషన్‌లో (Police Station‌) ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేసి ఇన్విస్టిగేషన్ స్టార్ చేశారు. చివరకు ఇవాళ ఉదయం మిడ్జిల్‌ శివార్లలోని ఒక చెరువులో తల్లీకూతుర్లు ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. స్థానికులు నుంచి వారి మృతదేహాలను (Dead bodies) వెలికితీశారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.


Also Read : Leopard Strays Into School: పదో తరగది విద్యార్థిపై చిరుత పులి ఎలా దాడి చేసిందో చూడండి!


అయితే తొమ్మిది నెలల చిన్నారిని.. సరిత తన నడుముకు కట్టుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దృశ్యం స్థానికులందరినీ కలచివేసింది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు (Police) డెడ్ బాడీలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే కారణంగా సరిత ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు తెలుస్తోంది. 


కాగా తిమ్మాజీపేట (Timmajipeta) మండలం గుమ్మకొండకు (Gummakonda) చెందిన సరితకు (Saritha) మిడ్జిల్‌కు చెందిన శ్రీశైలంతో రెండు సంవత్సారల కిందట పెళ్లి అయ్యింది. వీరికి ఒక కూతురు. మెట్టినింటి వేధింపులు తట్టుకోలేకే సరిత, తన తొమ్మిది నెలల కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


Also Read : Radhe Shyam Love Anthem: రాధేశ్యామ్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్​- ప్రభాస్​, పూజాల జోడీ అదిరిందిగా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook