Bandi Sanjay- CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (MP Bandi Sanjay Kumar) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో  ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లేఖలోని ముఖ్యాంశాలు:


** ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలి. 


** గత రెండేండ్లుగా కోవిడ్‌ మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు పోటీపరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. 


** మారుమూల గ్రామాల నుండి శిక్షణ కొరకు జిల్లా కేంద్రాలకు రావడం నిరుద్యోగ యువతకు వ్యయప్రయాసలతో కూడిన అంశం. కాబట్టి నియోజకవర్గానికొక ఉచిత స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అదనపు ఖర్చులు తగ్గించాలి.


** ఈ కోచింగ్‌ కేంద్రాలలో శిక్షణ పొందే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అల్పాహారం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. 


** ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రించాలి.


** పార్టీల ద్వారా ఏర్పాటు చేసే కోచింగ్‌ సెంటర్ల వల్ల అభ్యర్థుల్లో రాగద్వేషాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో టీశాట్‌, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌, కోచింగ్‌ కేంద్రాల ద్వారానే నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వాలి.


** ప్రతిజిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ యువతకు అవసరమైన కోచింగ్‌ మెటీరియల్‌ ఉచితంగా అందించాలి. 


** వెంటనే టెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించాలి.


Also Read: CM KCR Hospitalised: యశోద ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం క్షేమంగా ఉండాలన్న బండి సంజయ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook