CM KCR Hospitalised: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారం ఆందోళనకు గురిచేసిందన్నారు. అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
ఇవాళ (మార్చి 11) ఉదయం 9.30 గంటల సమయంలో సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఎడమ కాలు, ఎడమ చేయి లాగుతున్నట్లు కేసీఆర్ వైద్యులతో చెప్పారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు నేత్రుత్వంలోని వైద్య బృందం సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.@TelanganaCMO
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 11, 2022
మొదట యాంజియోగ్రామ్, ఆ తర్వాత సీటీ స్కాన్ టెస్టులు నిర్వహించారు. టెస్టుల రిపోర్టుల్లో అంతా నార్మల్ గానే ఉన్నట్లు వెల్లడైంది. ఎక్కడా ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు వెల్లడించారు. మరో గంట పాటు సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలోనే ఉండనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకోనున్నారు. మరోవైపు, కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలిసి పలువురు ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.
Also Read: CM KCR Hospitalised: యశోద ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం క్షేమంగా ఉండాలన్న బండి సంజయ్...
Also Read: Telangana CM KCR: సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు.. వ్యక్తిగత డాక్టర్ ఏం చెప్పారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook