MP DK Aruna: సీఎం రేవంత్ పై ఎంపీ డీకే అరుణ విమర్శలు.. తీవ్ర ఉద్రిక్తత..!
DK Aruna Controversy : కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో బిజెపి ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గానికి వెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో, రోడ్డుపై బైఠాయించి నిరసనలు చేయడం మొదలుపెట్టింది.
DK Aruna: తాజాగా బీజేపీ ఎంపీ డీకే అరుణ కొడంగల్ నియోజకవర్గం లగచర్ల పర్యటన తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది అని చెప్పవచ్చు. లగచర్ల వెళుతున్న ఆమె వాహనాన్ని పోలీసులు మన్నెగూడ వద్ద అడ్డుకోవడంతో ఈ వాతావరణం చెలరేగింది.
దీంతో పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అరుణను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బిజెపి నేతలు కూడా రోడ్డుపై బైఠాయించడంతో ఆ ప్రాంతం మొత్తం వాతావరణం వాడి వేడిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తనకు అవమానం జరిగింది అంటూ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
“నేను ఎంపీగా.. నా నియోజకవర్గంలో ప్రజలను పరామర్శించకూడదా? అంటూ ప్రశ్నించారు. నేను ఎంపీ ని, ఏం తప్పు చేశానని నన్ను అడ్డుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడింది? నేను కలెక్టర్ ను కలవడానికి వెళ్తున్నాను. నాకు అపాయింట్మెంట్ కూడా ఉంది. అయినా సరే నా నియోజకవర్గంలో నేను ఎక్కడికైనా వెళ్లే హక్కు, స్వతంత్రత నాకు ఉంది,” అంటూ ఆమె తెలిపింది.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వల్లే లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందని.. ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అరుణ. ఇక “లగచర్లకు రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదా? ముఖ్యమంత్రి అన్నను పంపిస్తారు.. ఎంపీగా నన్ను పంపించరా? ఇదెక్కడి న్యాయం,”.. అంటూ ప్రశ్నించింది.
“రాష్ట్రంలో ఎంపీగా..నా నియోజకవర్గంలో నేను పర్యటించడానికి నాకు స్వతంత్రం లేదా,” అంటూ ప్రశ్నించింది. ఇకపోతే డీకే అరుణ ను స్టేషన్ కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా నేను స్టేషన్ కు ఎందుకు వస్తాను..? ఏం తప్పు చేశానని నన్ను స్టేషన్ కి తీసుకెళ్తారు అంటూ పోలీసుల.. తీరుపై మండిపడింది. ప్రస్తుతం అక్కడి వాతావరణం చాలా వేడిగా మారిపోయిందని చెప్పవచ్చు.
Also Read : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి