Etela Rajender Fires on CM Revanth Reddy: హామీల చర్చపై రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తున్నానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హామీల అమలుపై చర్చకు ప్రధాని మోడీ ఎందుకు అని.. తాము ఇక్కడే ఉన్నామని ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలే కాకుండా.. 420 హామీలపై చర్చిద్దామన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని.. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారని అన్నారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేసిందని.. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: 'వచ్చి కోరిక తీరుస్తావా.. వీడియోలు బయటపెట్టాలా?'.. లా విద్యార్థిపై నలుగురు గ్యాంగ్‌ రేప్‌


ఫార్మా సిటీ రద్దు చేసి రైతులకు తిరిగి భూమి ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారని.. కానీ ఫోర్త్ సిటీ పేరుతో 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొడంగల్‌లో రైతులు భూములు ఇవ్వలేమని కాళ్లు మొక్కినా.. బెదిరింపు ధోరణితో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. రైతులు నక్సలైట్లు కాదన్నారు.


రేవంత్ రెడ్డిది తమ కొడంగల్ కాకపోయినా గెలిపించామని.. ఇప్పుడు తమను హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నానరి ఈటల అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని.. ఇంతలా ప్రజలను ఎవరూ హింసించలేదన్నారు. మూసీ పక్కన భూములు లాక్కిని.. కార్పొరేట్‌కు అప్పగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలు, లగచర్ల వంటి సంఘటనలు చోటు చేసుకుంటుండగా.. ప్రభుత్వం మాత్రం సంబరాలు చేసుకుంటోందని ఫైర్ అయ్యారు.


రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి ప్రధాని మోదీపై మహారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదని.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుందన్నారు. హామీలు నెరవేర్చకుండా.. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారని అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు. హామీల చర్చపై రేవంత్ రెడ్డి విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని.. చర్చకు ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. 


Aslo Read: Central Bank of India: ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటా విక్రయం.. కేంద్రం సంచలన నిర్ణయానికి కారణాలు ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.