MP navneet kaur rana hot comments on owaisi brothers: తెలంగాణలో ఎన్నికల దగ్గరపడుతున్న కొలది రాజకీయాలు మరింత హాట్ గా మారుతున్నాయి. నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నువ్వేంత.. అంటే నీ లెక్కెంత అన్నట్లు ఒకరిపై మరోకరు బహిరంగంగానే తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. నేతల మాటలు, దూషణలు మాత్రం ప్రస్తుతం పీక్స్ కు చేరిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ స్థానం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానాన్ని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి మాధవీలత బరిలో ఉన్న విషయం తెలిసిందే. మాధవీలతను ఎలాగైన గెలిపించాలని కేంద్ర నాయకత్వం అంతా రంగంలోకి దిగింది. ఇక్కడ బీజేపీ కీలక నేతలు.. అమిత్ షా, కిషన్ రెడ్డి, రాజాసింగ్ లు మాధవీలతకు సపోర్ట్ గా ప్రచారం నిర్వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మాధవీలత కూడా అన్ని వర్గాల ప్రజలను కలుపుని పోతు.. తనను గెలిపిస్తే ఎలాంటి మార్పులు తీసుకొస్తానో.. అన్న విషయంను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఓల్గ్ సిటీకి ఓవైసీ బ్రదర్స్ చేసిందేమీ లేదంటూ మాధవీలత తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకవైపు భాగ్య నగరం డెవలప్ మెంట్ లో దూసుకుపోతుంటే.. కనీసం ఓల్గ్ సిటీలో మెట్రో కూడా రాలేదని, దీని వెనుకాల కుట్రలు ప్రజలకు తెలుసని మాధవీలత ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పదునైన ప్రసంగాలను వినడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మాధవీలతకు ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయిందని చెప్పుకొవచ్చు.


ఈ నేపథ్యంలో.. ఎంపీ అభ్యర్థి మాధవీలతకు సపోర్ట్ గా అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రంగంలోకి దిగారు. ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ మాధవీలత ను గెలిపించాలని కూడా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఓవైసీ బ్రదర్స్ ను గెలిపిస్తే.. పాతబస్తీనీ పాక్ లా చేస్తారంటూ ఎద్దేవా చేశారు. గతంలో అక్బరుద్దీన్ ఒక పబ్లిక్ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలకు,ఇప్పుడు అమరావతి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. గతంలో అక్బరుద్దీన్ 15 నిముషాలు పోలీసులు తమ తడాఖా ఏంటో చూపిస్తామంటూ  వ్యాఖ్యలు చేశారు.


Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...


తాజాగా, నవనీత్ కౌర్.. బిడ్డా.. మీరు 15 నిముషాలు అంటున్నారుకదా... కానీ మాకు కేవలం 15 సెకన్లు చాలు.. ఏంజరిగిందో కూడా మీ బ్రదర్స్ ఊహించలేరు.. అంటూ (ఓవైసీ బ్రదర్స్)కు స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చారు. అంతే కాకుండా ఓవైసీకు వేచే ప్రతి ఓటు పాక్ కు వేసినట్లే అని ఓవైసీ బ్రదర్స్ ను ఏకీపారేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కేంద్రంలో మీ ప్రభుత్వ ఉంది.. మీకు ఏంచేస్తారో చేసుకొండి.. మేమేం భయపడటం లేదు అంటూ అసదుద్దీన్ ఓవైసీ కూడా కౌంటర్ ఇచ్చారు. 15 సెకన్లు అని ఒక గంట పాటు తీసుకోండి.. ఏంచేస్తామో మేముకూడా చూస్తామంటూ నవనీత్ కౌర్ కు రిప్లై ఇచ్చారు.  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter