Mulugu Lawyer Murder: న్యాయవాది మల్లారెడ్డి హత్య వెనక సుపారీ గ్యాంగ్... మూడు రోజుల రెక్కీ తర్వాత మర్డర్..
Mulugu Lawyer Murder Case: ములుగు జిల్లాలో సంచలనం రేపిన మల్లారెడ్డి హత్య వెనక సుపారీ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ గ్యాంగ్‌ను రంగంలోకి దింపింది ఎవరనేది ఇంకా తేలలేదు.
Mulugu Lawyer Murder Case: ములుగు జిల్లాలో మల్లారెడ్డి అనే న్యాయవాది హత్య సంచలనం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు మల్లారెడ్డిని కారులో వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. పందికుంట ప్రధాన రహదారి పక్కనే ఈ హత్య జరిగింది. మల్లారెడ్డి హత్య వెనక సుపారీ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది.. ఏ కారణాలతో అతన్ని చంపారనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈ విషయాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మల్లారెడ్డి హన్మకొండలో స్థిరపడ్డారు. ములుగు జిల్లాలో ఆయనకు ఎర్రమట్టి క్వారీలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ వ్యవసాయ భూములకు సంబంధించి కొన్నాళ్లు వివాదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదాల పరిష్కారం కోసమే తరచూ ములుగు రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాలకు మల్లారెడ్డి వెళ్లి వస్తున్నట్లు తాజాగా కుటుంబ సభ్యులు తెలిపారు.
ములుగు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులతో మల్లారెడ్డి గొడవపడ్డారనే విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరువురి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరగ్గా.. ప్రత్యర్థి అతన్ని చంపేస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మల్లారెడ్డిని హత్య చేసేందుకు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. ఈ హత్య కోసం రూ.10 లక్షలు ఇచ్చి సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించినట్లు జరుగుతోంది.
మూడు రోజులుగా మల్లారెడ్డి కదలికలపై సుపారీ గ్యాంగ్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి హత్య నేపథ్యంలో అతనికి సంబంధించిన భూములు,ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కూతురు పేరిట దాదాపు 113 ఎకరాల భూమి ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇక పోస్టుమార్టమ్ రిపోర్టులో మల్లారెడ్డి శరీరంపై మొత్తం 13 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మెడ, పొట్ట భాగంలో దుండగులు కత్తులతో పొడిచి చంపినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
Also Read: Kcr vs Governer: కేసీఆర్ సర్కార్ వర్సెస్ రాజభవన్.. జాతీయ జెండాల పంపిణీలో పోటాపోటీ
Also Read: Achyuthapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకేజ్.. 100 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook