Lawyer Brutal Murder in Mulugu: ములుగు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. హనుమకొండకు చెందిన మూలగుండ్ల మల్లారెడ్డి (58) అనే న్యాయవాదిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ములుగు కలెక్టరేట్ కార్యాలయం నుంచి హనుమకొండకు తిరిగి వెళ్తుండగా పందింకుంట బస్టాప్ సమీపంలో దుండగులు మల్లారెడ్డిని అడ్డగించారు. పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్య హనుమకొండ జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
హత్యకు గురైన మల్లారెడ్డికి ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో వ్యవసాయ భూమి ఉంది. అక్కడే ఎర్రమట్టి క్వారీతో పాటు పలుచోట్ల పెట్రోల్ బంకులు కూడా నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా మల్లారెడ్డికి సంబంధించిన భూములపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భూ వివాదాల పరిష్కారానికి కొద్దిరోజులుగా తరచూ ములుగు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వస్తున్నాడు.
అదే సమయంలో మల్లారెడ్డి కదలికలపై ప్రత్యర్థులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సోమవారం మల్లారెడ్డి ములుగు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చినట్లు తెలుసుకుని.. మల్లారెడ్డి తిరిగి వెళ్లే సమయంలో అతనిపై దాడికి పాల్పడ్డారు. పందింకుంట సమీపంలో సాయంత్రం 6.30 గం. సమయంలో మల్లారెడ్డి కారును అడ్డుకున్నారు. కావాలనే మల్లారెడ్డి కారును వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో మల్లారెడ్డి కారు దిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ కారులోని వ్యక్తుల్లో ఒకరు మల్లారెడ్డికి క్షమాపణలు చెప్పారు. దీంతో మల్లారెడ్డి మళ్లీ తన కారులోకి ఎక్కబోయారు.
ఇంతలో మల్లారెడ్డిని ఢీకొట్టిన కారు నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చి అతన్ని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గతేడాది, పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద న్యాయవాద దంపతులను నడిరోడ్డు పైనే కొంతమంది దుండగులు కత్తులతో పొడిచి చంపడం తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో న్యాయవాది కూడా ఇదే తరహాలో హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపుతోంది.
Also Read: Elachi Remedies for Money: ఇలాచీ పరిహారాలు.. ఇలా చేస్తే డబ్బే డబ్బు, మనీ కష్టాలన్నీ మాయం..
Also Read : Rohit Sharma: అందుకే అవేశ్ ఖాన్‌కు చివరి ఇచ్చా.. విమర్శలపై స్పందించిన రోహిత్ శర్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.