Sammakka Vanadevatha Mahajatara: ములుగు జిల్లాలో సమ్మక్క సారాలమ్మ మహాజాతర వేడుకగా ప్రారంభమైంది. ఈ జాతరలో  రెండవ రోజు ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క తల్లి జనం మధ్యలోనికి చేరుకుంది. ఇక సారాలమ్మకూడా గురువారం రాత్రి గద్దెకు చేరుకుంటారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే సమ్మక్కసారాలమ్మను దర్శించుకొవడానికి వేలాదిగా భక్తులు వస్తున్నారు. ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. భక్తులు అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.


ఇదిలా ఉండగా.. వనదేవత జాతరలో గురువారం రెండు విషాదరకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆలయం పరిసరాల్లో ఇద్దరు భక్తులు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వనదేవతను దర్శించుకుని మొక్కులు తీర్చుకొవడానికి వచ్చిన జనగామ జిల్లా బచ్చన్న పేటకు చెందిన కొమురయ్య గుండెపోటుతో మరణించాడు.


అదే విధంగా కామారెడ్డికి చెందిన సాయిలు  అనే వ్యక్తి జంపన్న వాగులో దిగి స్నానం చేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్న అధికారులు ప్రాథమిక వైద్యం చేసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సదరు వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు మరణాలు ఒకేరోజు సంభవించడంతో జాతర ప్రాంతంలో తీవ్ర విషార ఛాయలు అలుముకున్నాయి. అమ్మవారికి మొక్కులు తీర్చుకుందామని వస్తే, తమ వారు ప్రాణాలు కొల్పోవడంతో  ఆ కుటుంబాలు కూడా పుట్టేడు దుఃఖంలో మునిగిపోయాయి. 


Read More:Nayantara: సన్ ఫ్లవర్ శారీలో నయనతార అందాలు.. ‘లవ్ థిస్ ఫ్లవర్’ అనేసిన విజ్ఞేశ్ శివన్


Read More: Spearmint: పుదీనా తింటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలుసా..
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook