Spearmint: పుదీనా తింటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలుసా..

Spearmint Side Effects: పుదీనాని మనం ప్రతిరోజు వంటలలో ఉపయోగిస్తాము. దీని ఆహారంలో ఉపయోగించడం వల్ల వంట ఎంతో టేస్ట్‌గా ఉంటుంది. అంతేకాకుండా మంచి సవాసన కూడా ఇస్తుంది. అయితే దీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్ని దుష్ప్రభావలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2024, 11:22 AM IST
Spearmint: పుదీనా తింటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలుసా..

Spearmint Side Effects: ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఈ ఆకుకూరలలో పుదీనా కూడా ఒకటి. దీని ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తారు. ఇది వంటలలో ఉపయోగించడం వల్ల వంట రుచిగా, సువాసన కలిగి ఉంటుంది. దీన్ని సలాడ్ లలో, టీగా తయారు చేస్తారు. అయితే పుదీనానీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

పుదీనాలో అనేక పోషకాలు ఉన్నప్పటికి దీని మితంగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. అయితే ముందు పుదీనా వల్ల కలిగే మంచి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం..

పుదీనా ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకంతో బాధపడుతున్నవారు దీని ఉపయోగించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గతాయి.  పుదీనా  తీసుకోవడం వల్ల అజీర్ణం, అసౌకర్యంతో సహా సమస్యలు తగ్గుతాయి. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీని తీసుకోవడం వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. పుదీనా తీసుకోవడం వల్ల చురుకుదనం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. 

Also Read Glowing Skin: ఈ ఫేషియల్ మసాజ్ తో కాంతివంతమైన చర్మం మీ సొంతం!

పుదీనా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు:

పుదీనాని ప్రతిరోజు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పుదీనా తీసుకోవడం వల్ల  యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను పెంచుతుంది. పుదీనాకు ప్రతిరోజు తీసుకోవడం వల్ల కొందరిలో అలెర్జీ వంటి లక్షణాలు కలుగుతాయి.  గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు పుదీనాను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అలర్జీ సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. పుదీనాని చిన్న పిల్లలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు పిల్లలకు ఇప్పటి నుంచి ఇవ్వడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు.ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. మీరు దీంతో వివిధ రకాల ఆహారపదార్థాలు తయారు చేసుకోవచ్చు.  దీని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే అనారోగ్య సమస్యల బారిన పడుతారు.

Also Read Badam Milk: బాదం పాలు ఆరోగ్యానికి ఎంతవరకూ మంచివి, నష్టాలు కూడా ఉన్నాయా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News