సూర్యాపేట : కోవిడ్-19 నివారణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, పోలీసులు ఎంత వారిస్తున్నా... కొంతమంది ఉల్లంఘనులు నిర్లక్ష్యంగా రోడ్లమీద తిరుగుతూనే ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్న ఓ కూల్‌ డ్రింక్స్‌ వ్యాపారికి రూ.25 వేల జరిమానా విధించి గట్టి షాక్ ఇచ్చారు కోదాడ మున్సిపల్‌ కమిషనర్ మల్లా రెడ్డి. కోదాడకు చెందిన కేశవరావు మండల కేంద్రం నుంచి సమీపంలోని గ్రామాలకు కూల్‌డ్రింక్స్‌ను సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ పాటిస్తున్న నేపథ్యంలో కూల్ డ్రింక్స్ సరఫరా చేయొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరించినప్పటికీ అతడు అధికారులు ఆదేశాలు పెడచెవిన పెడుతూ గ్రామాలకు కూల్ డ్రింక్స్ విక్రయాలు కొనసాగిస్తూనే వచ్చాడు. ఈ క్రమంలోనే గురువారం కూల్ డ్రింక్స్ తరలిస్తున్న కేశవరావును అడ్డుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ మల్లారెడ్డి.. అతడికి జరిమానా విధించి పట్టణ పౌరులు అందరికీ గట్టి షాక్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : EAMCET, ECET exams: ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణపై సర్కార్ వైఖరి


ఈ సందర్భంగా కోదాడ మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే ఎవరికైనా ఇలాంటి శిక్ష తప్పదు అని హెచ్చరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..