Munugode Bypoll Money:  హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబుడుతోంది. వారం రోజుల్లోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా 10 కోట్ల రూపాయల డబ్బును పట్టుకున్నారు. బుధవారం ఉదయం బంజారాహిల్స్ లో ఓ కారులో తరలిస్తున్న రెండు  కోట్ల 40 లక్షల  రూపాయలను నగదును గుర్తించి పోలీసులు సీజ్ చేశారు. బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రోడ్డు నెంబర్ 12లో కారులో తరలిస్తున్నారనే  పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు వెస్ట్ జోన్ పోలీసులు. కార్లను తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో రెండు కోట్ల రూపాయల నగదు దొరికింది. పట్టుబడిన మనీని సీజ్ చేసిన అధికారులు.. కారును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో దాదాపు 10 కోట్ల రూపాయల హవాలా మనీ పట్టుడింది. మంగళవారం గాంధీనగర్‌ లో 3.5 కోట్ల రూపాయలను తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.ఈ డబ్బును సైదాబాద్‌లో ఉంటున్న బాలరాజుగౌడ్ అనే వ్యక్తికి అప్పగించాలని కొందరు వ్యక్తులకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. హవాలా మనీతో ఉన్న కార్లను గాంధీనగర్‌లో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు..నగదుతో పాటు రెండు కార్లను సీజ్ చేశారు. కార్లలో నగదు తరలిస్తూ పట్టుబడిన ఆరుగురిని పోలీసులకు అప్పగించారు. సైదాబాద్‌కు చెందిన బాలరాజు గౌడ్ ఎవరూ..? అతనికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపిన వ్యక్తి ఎవరూ అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ డబ్బును ఎందుకోసం తీసుకొచ్చారు..  బాలరాజు  ద్వారా ఇంకా ఎవరికైనా తరలిస్తున్నారా  అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు.


అక్టోబర్ 9న  జూబ్లీ హిల్స్ లో 2.49 కోట్ల రూపాయలను  టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 8 న చంద్రాయణగుట్టలో  79 లక్షల రూపాయలు సీజ్ చేశారు. అక్టోబర్ 7 న వెంకటగిరి లో 54 లక్షలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సెప్టెంబర్ 29న కూడా రూ. 1.24 కోట్లను కారులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఓటర్లకు పంపిణి చేయడానికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.మునుగోడు  బైపోల్ జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెంచారు. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున హవాలా నగదు పట్టుబడుతోంది. మునుగోడు కోసమే నగదును తరలిస్తున్నారనే పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ కు సమీపంలోనే మునుగోడు నియోజకవర్గం ఉండటంతో మరింతగా సోదాలు పెంచారు.


Also Read : Munugode Bypoll: మునుగోడులో 25 వేల దొంగ ఓట్లు? ఎవరు చేర్పించారు.. ఏం జరిగింది?


Also Read : Munugode Bypoll: డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి! మునుగోడులో మార్మోగుతున్న నినాదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి