Munugode Bypoll:  తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు పార్టీల నేతలు. ఓటర్ల  ప్రసన్నం కోసం చివరి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థి తరపున ప్రచారానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఈనెల 30న చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది అధికార పార్టీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు పర్యటన ఉంది. మునుగోడులో జరగనున్న ఎన్నికల సభకు నడ్డా హాజరవుతారని గతంలో బీజేపీ ప్రకటించింది. అయితే జేపీ నడ్డా మునుగోడు పర్యటన రద్దైందని తెలుస్తోంది. నడ్డా సభ రద్దుపై బీజేపీ అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోయినా... ఆయన రాకపోవచ్చని తెలుస్తోంది. బహిరంగ సభ ఏర్పాట్లు కూడా ఇంకా మొదలు కాకపోవడంతో దాదాపుగా నడ్డా సభ రద్దు అయిందనే చెబుతున్నారు. బహిరంగ సభకు బదులుగా మండల స్థాయిలోనే ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. రోజుకు రెండు మండలాల్లో ఆత్మీయ సమావేశాలకు ప్లాన్ చేశారు.  శుక్రవారం నాంపల్లి మండల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


మరోవైపు జేపీ నడ్డా మునుగోడు బహిరంగ సభ రద్దుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రస్తుతం తెలంగాణతో పాటు జాతీయ స్థాయిలో రచ్చగా మారింది. బీజేపీ అగ్ర నేతల డైరెక్షన్ లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిగాయని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం ఫాంహౌజ్ లో జరిగిందంతా కేసీఆర్ నడిపిస్తున్న డ్రామా అని మండిపడుతున్నారు. ఫాంహౌజ్ డీల్ కు సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో జేపీ నడ్డా మునుగోడు సభ రద్దు కావడం చర్చగా మారింది. నడ్డా సభ రద్దును తమకు అనుకూలంగా మలుచుకుంటూ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పోస్టులు పెడుతోంది. ఓటమి ఖాయమైందని గ్రహించడం వల్లే నడ్డా మునుగోడుకు రావడం లేదని ప్రచారం చేస్తోంది. అయితే కమలనాధులు మాత్రం బహిరంగ సభ కంటే మండలాల వారీగా నిర్వహించే ఆత్మీయ సమావేశాలతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే ప్లాన్ మార్చామని చెబుతున్నారు. హుజురాబాద్ లోనూ ఆత్మీయ సమావేశాలు మంచి ఫలితాలు ఇచ్చాయంటున్నారు.


Also Read : TRS MLAS BRIBE:  పోలీసుల దగ్గర ముడున్నర గంటల వీడియో.. కేసీఆర్ చేతిలో బీజేపీ పెద్దల చిట్టా?


Also Read : Rishab Shetty Touches Rajinikanth Feet : కాంతారాపై సూపర్ స్టార్ ప్రశంసలు.. తలైవా కాళ్లు మొక్కిన రిషభ్ శెట్టి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి