Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలో బిగ్ ట్విస్ట్.. టీడీపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్?
Munugode Bypoll: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి.మునుగోడు బైపోల్ లో పోటీ చేయాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతుందనే ప్రచారం సాగుతోంది.
Munugode Bypoll: తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మారిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. నామినేషన్లు మొదలు కావడంతో అన్ని పార్టీల నేతలు అక్కడే మోహరించారు. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. టీజేఎస్ అభ్యర్థి బరిలో ఉండనున్నారు. ప్రజా యుద్దనౌక గద్దరు మునుగోడు బరిలో ఉండబోతున్నారు. ఇక మునుగోడు బైపోల్ లో పోటీ చేయాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతుందనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీకి చెందిన సీనియర్ నేతను తమ పార్టీ నుంచి పోటీ చేయించే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారంటున్నారు. మునుగోడులో బీసీ ఓటర్లు భారీగా ఉన్నా.. ప్రధాన పార్టీలు మాత్రం రెడ్డీలనే పోటీకి నిలిపాయి. దీంతో బలమైన బీసీ నేతను పోటీకి టీడీపీ నేతలు ఒప్పిస్తున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ పెట్టిన సీఎం కేసీఆర్ కు షాకిచ్చేలా చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు.. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బర నర్సయ్య గౌడ్ తో చర్చలు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 2014లో భువనగిరి ఎంపీగా గెలిచారు బూర. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా భువనగిరి ఎంపీ పరిధిలోనే ఉంటుంది. మునుగోడు నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓటర్లే ఎక్కువ. నర్సయ్య గౌడ్ కు మునుగోడుతో మంతి అనుబంధం ఉంది. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలోనూ అధికార పార్టీ టికెట్ ఆశించారు బూర. తనకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఓపెన్ గానే ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు రెండు నెలలుగా నియోజకవర్గంలో తిరుగుతున్న జగదీశ్ రెడ్డి.. ప్రచారానికి మాత్రం బూరను పిలవడం లేదు. దీంతో మంత్రిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు బూర. తనను కావాలనే అవమానిస్తున్నారనే కసితో ఉన్నారు. బూర విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి తీరుపై నియోజకవర్గంలోని గౌడ నేతలు మండిపడుతున్నారు.
మునుగోడులో బీసీ వాదం బలంగా ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది. బీసీ నేతగా బూరకు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలని ఆశిస్తున్న చంద్రబాబు.. బీసీ కార్డుతో మునుగోడులో సత్తా చాటాలని చూస్తున్నారని తెలుస్తోంది. మునుగోడు గత చరిత్రను చూసినా ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 7. సీపీఐ ఐదు సార్లు గెలిచింది. అయితే 12 సార్లు అగ్రవర్గాల వారే గెలిచారు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ పార్టీలు మునుగోడులో ఇంతవరకు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదు. కాని చంద్రబాబు మాత్రం రెండు సార్లు బీసీ నేతలకు టికెట్ ఇచ్చారు. పద్మశాలీ వర్గానికి చెందిన జెల్లా మార్కండేయులు, చిలువేరు కాశీనాథ్ కు టికెట్ ఇచ్చారు. బీసీల విషయంలో టీడీపీ తప్ప మిగితా పార్టీలు పట్టించుకోలేదనే భావన నియోజకవర్గ నేతల్లో ఉంది. ఇప్పుడు కూడా బీసీ కార్డు ప్రయోగించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారంటున్నారు.
నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, గతంలో ఎంపీగా పని చేయడంతో మునుగోడులో బూర నర్సయ్యగౌడ్ పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారంటున్నారు. బూర నర్సయ్య గౌడ్‌కు బీఫాం అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు పూర్తి చేశారని అంటున్నారు. అయితే టీడీపీ నుంచి పోటీ విషయంలో బూర నర్సయ్య గౌడ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదంటున్నారు.
Also Read : Hyderabad Rain Alert: కుండపోత వానతో హైదరాబాద్ జలమయం.. మరో రెండు రోజులు డేంజరే!
Also Read : Today Gold Rate: దిగిరాని పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి