Hyderabad Rain Alert: కుండపోత వానతో హైదరాబాద్ జలమయం.. మరో రెండు రోజులు డేంజరే!

Hyderabad Rain Alert: పగబట్టినట్లుగా  తెలంగాణపై ప్రతాపం చూపిస్తున్నాడు వరుణుడు. ముఖ్యంగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కొన్ని గంటల్లోనే 10 నుంచి 15 సెంటిమీటర్ల వర్షం కురవడంతో వరద పోటెత్తింది.

Written by - Srisailam | Last Updated : Oct 9, 2022, 10:08 AM IST
  • హైదరాబాద్ లో కుండపోత
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • మరో రెండు రోజులు వర్షాలే
Hyderabad Rain Alert: కుండపోత వానతో హైదరాబాద్ జలమయం.. మరో రెండు రోజులు డేంజరే!

Hyderabad Rain Alert: అక్టోబర్ రెండో వారంలోనూ వరుణుడు కుమ్మేస్తున్నాడు. పగబట్టినట్లుగా  తెలంగాణపై ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా కొన్ని గంటల్లోనే 10 నుంచి 15 సెంటిమీటర్ల వర్షం కురుస్తుండటంతో వరద పోటెత్తింది. హైదరాబాద్ లోని వందలాది కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లన్ని చెరువులుగా మారిపోవడంతో వాహనదారులు నరకం చూశారు.

శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో మొదలైన వాన అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, శేరిలింగం పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్ పేట, నాంపల్లితో పాటు ఓల్ట్ సిటీ ప్రాంతాల్లో కుంభవృష్టిలా వర్షం కురిసింది. ఏకధాటిగా 3 గంటల పాటు కురిసిన వర్షంతో భాగ్య నగరం అతలాకుతలమైంది.

గ్రేటర్ పరిధిలోని షేక్ పేట్ లో అత్యధికంగా 136 మిల్లిమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మాదాపూర్ కాకతీయ హిల్స్ లో  128, మాదాపూర్ 122,  జూబ్లీహిల్స్ 114, హైదర్ నగర్ లో 115, కాజాగూడ లో 97, రాయదుర్గ 93, మియాపూర్ 81 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో భారీ వర్షం కురవడంతో వాహనదారులు నరకం చూశారు. నిజాంపేట్ లో భారీ వర్షానికి ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. బండారి లే అవుట్  రెడ్డి అవెన్యూ కాలనీని వరద ముంచెత్తింది. నాలా పనులు ఆలస్యం కావడంతోనే వరద కాలనీలను ముంచేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరో రెండు రోజుల పాటు తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read : IND vs PAK: భారత్‌తో పాకిస్తాన్ పోరు.. వైరల్ అవుతోన్న పాక్‌ పేసర్ షహీన్‌ అఫ్రిది ట్వీట్‌!

Also Read : Prithvi Shaw: పరుగులు చేస్తున్నా.. భారత జట్టులో చోటు రావట్లేదు! యువ ఓపెనర్‌ అసహనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News