Munugode Byelection: తెలంగాణ రాజకీయాలన్నీ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి పార్టీలు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయబోతుండగా... అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తిగా మారింది. మునుగోడులో పోటీ చేసేందుకు కాంగ్రెస్ లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా లీకైన ఓ ఆడియో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ లో టికెట్ లొల్లికి సంబంధించి ఆడియో వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి.. ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో లీకైంది. అందులో మునుగోడు ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపిక, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు పాల్వాయి స్రవంతి. మునుగోడు టికెట్ రేసులోకి వచ్చిన చలమల్ల కృష్ణారెడ్డి టికెట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు పాల్వాయి స్రవంతి. చండూరు సభ తన వల్లే సక్సెస్ అయ్యిందంటూ కార్యకర్తలకు ఫోన్ చేశారు. ముక్కు,మొఖం తెలియని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మునుగోడులో ఓడిపోవాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. రేవంత్ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచే వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పాల్వాయి స్రవంతి. సొంత ఊరి ప్రజలకు కూడా తెలియని కృష్ణారెడ్డి ఎలా తెరపైకి తీసుకువస్తారంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు పాల్వాయి స్రవంతి.


కాంగ్రెస్ నాయకుడితో పాల్వాయి స్రవంతి మాట్లాడిన మాటలు కాక రాజేస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్ లో టికెట్ లొల్లి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. మునుగోడు నుంచి స్రవంతితో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన చెరకు సుధాకర్, బీసీ నేతలైన పున్నా కైలాస్ నేత, పల్లె రవికుమార్ గౌడ్ తో పాటు బడా కాంట్రాక్టర్ చల్లమల్లా కృష్ణారెడజ్డి పేర్లు వినిపిస్తున్నాయి. చండూరులో నిర్వహించిన పార్టీ సభకు కృష్ణారెడ్డే డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ పాల్వాయి స్రవంతి మాట్లాడారని తెలుస్తోంది.


Also read:Hyd Metro: హైదరాబాద్‌ మెట్రోకు పూర్వ వైభవం దక్కేనా..రోజువారి ప్రయాణికుల సంఖ్య ఎంతంటే..!




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook