Corona Updates in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..లెటెస్ట్ రిపోర్ట్ ఇదే..!

Corona Updates in India: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ్టి కోవిడ్ బులిటెన్ ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Aug 10, 2022, 12:32 PM IST
  • దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
  • కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల
  • లెటెస్ట్ కరోనా బులిటెన్ విడుదల
Corona Updates in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..లెటెస్ట్ రిపోర్ట్ ఇదే..!

Corona Updates in India: దేశంలో కరోనా కేసులు హెచ్చు తగ్గుల మధ్య నమోదు అవుతున్నాయి. తాజాగా 16 వేల 047 కేసులు వెలుగు చూశాయి. రోజువారి పాజిటివిటీ రేటు నిన్నటితో పోలిస్తే ఇవాళ పెరిగింది. గడిచిన 24 గంటల్లో పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉంది. ఇటు యాక్టివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షా 28 వేల 261 క్రియా శీల కేసులు ఉన్నాయి.

ఇటు రికవరీ రేటు ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 19 వేల 539 మంది కరోనాను జయించారు. గతకొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ఆయా ఆయా రాష్ట్రాలు ఆంక్షలను కఠిన తరం చేశాయి.

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పొరుగు దేశం నేపాల్ అలర్ట్ అయ్యింది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించింది. ఇటీవల ఝలాఘట్ సరిహద్దు మీదుగా బైతడి జిల్లాకు వచ్చిన నలుగురు భారతీయులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని స్వదేశానికి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. భారత్ నుంచి వచ్చే నేపాలీయుల నుంచి వైరస్ వ్యాప్తి అవుతోందని అధికారులు చెబుతున్నారు.

Also read:Hyd Metro: హైదరాబాద్‌ మెట్రోకు పూర్వ వైభవం దక్కేనా..రోజువారి ప్రయాణికుల సంఖ్య ఎంతంటే..!

Also read:Raksha Bandhan: రక్షాబంధన్ సందర్భంగా మీ చేతులను గోరింటాకుతో అలంకరించుకోండి..డిజైన్లు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News