Munugodu election Nominations 2022: దేశవ్యాప్తంగా అందరిచూపు మునుగోడుపైనే ఉంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మునుగోడులో రాజకీయ వేడి కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికల్లో (Munugodu byelction 2022) విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీని కోసం పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. దీని కోసం చండూరులో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చండూరు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును రిటర్నింగ్‌ అధికారిగా నియమించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్ కూడా అధికారులు ఏర్పాటు చేశారు. 


నామినేషన్ల పరిశీలను అక్టోబరు 15న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబరు 17 వరకు ఉంది. నవంబరు 3 తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ (Munugodu byelection 2022 Polling) జరుగనుంది. నవంబరు 6న ఓట్ల లెక్కింపు మెుదలుపెట్టి.. అనంతరం విజేతను ప్రకటిస్తారు. 


ప్రచారం వేగవంతం...
ఇవాల్టి నుంచి నామినేషన్‌ ప్రక్రియ షురూ కావడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా.. ఎమ్మెల్యే, మంత్రులను మునుగోడుకు పంపించి ప్రచారం చేయిస్తోంది. ఈ ప్రచార మానిటరింగ్ బాధ్యతలను మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఇవాళ తేలనుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే టీఆర్ఎస్ అధిష్టానం మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ, కాంగ్రెస్ లు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 


Also Read: TRS to BRS: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు, జండా మారుతాయా ? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook