Congress leaders attacks on ktr convoy video: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను కాంగ్రెస్ కార్యకర్తలు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో మూసీ బాధితుల్ని పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లారు. ఆ సమయంలో కొంత మంది కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అంతే కాకుండా.. కేటీఆర్ గో బ్యాక్.. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేపట్టారు.దీంతో అక్కడ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కేటీఆర్ సైతం తీవ్రఆందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే హైడ్రా సిబ్బంది.. చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీన్ని పరిశీలించేందుకు కేటీఆర్ వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ అంబర్ పేట్ వస్తారని తెలసుకుని అక్కడ కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసనలకు రెడీ అయినట్లు తెలుస్తోంది.


మరోవైపు నిన్న.. తెలంగాణ భవన్ మీద కొంత మంది కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున వెళ్లారు. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. అక్కడ పరస్సరం దాడులు సైతం చేసుకున్నారు. తాజాగా మాత్రం.. కేటీఆర్ కాన్వాయ్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడిచేయడం మాత్రం వార్తలలో నిలిచింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 


మరోవైపు హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల బాధితులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకుని తమ గోడును చెప్పుకున్నారు. తాము అండగా ఉంటామని కూడా కేటీఆర్, హరిష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కూడా హమీ ఇచ్చారు. హైడ్రా వస్తుందంటే తమకు చెప్పాలని, హైడ్రా కంటే ముందు తాము అక్కడ ఉంటామన్నారు. అదే విధంగా బాధితులకు అన్నిరకాలుగా లీగల్ సహాకారం కూడా అందిస్తామని కూడా బీఆర్ఎస్ శ్రేణులు హమీ ఇచ్చిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో మూసీ నది ఇతర ప్రాంతాలలో కూల్చివేతల ప్రదేశాలకు వెళ్లి మరీ కేటీఆర్ బాధితుల గోడును వింటున్నారు. అంబర్ పేట, గోల్నాక, తులసీ నగర్ ప్రాంతాలలో పర్యటించి కేటీఆర్ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  కేటీఆర్ కాన్వాయ్ పై దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరిష్ రావు ఖండించారు.


ప్రజల పక్షాల మాట్లాడేందుకు వెళ్లేందుకు వెళ్తే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. ఇదేనా.. రాహుల్ గాంధీ మొహబ్బత్ కే దుకాన్ అంటూ సెటైర్ లు వేశారు.  అంతేకాకుండా.. ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడంపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ గారిపై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని కూడా హరిష్ రావు డిమాండ్ చేశారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.