Myanmar Refugees In Hyderabad: హైదరాబాద్‌లో రోహింగ్యాల ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయి. మయన్మార్‌కు చెందిన ఇద్దరు రోహింగ్యాలను సౌత్‌జోన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంతోష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వారిని అరెస్ట్‌ చేశారు. భారత పౌరులుగా చెలామణి అవుతూ వాళ్లు సంపాదించిన సర్టిఫికెట్ల జాబితా చూసి పోలీసు అధికారులు విస్తుపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మయన్మార్‌కు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ అలీ, షేక్‌ కమాల్‌ అనే ఇద్దరూ హైదరాబాద్‌ పాతబస్తీలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వాళ్లిద్దరిదీ మయన్మార్‌లో ఒకే ఊరు. ఇద్దరూ రఖీనే రాష్ట్రంలోని మాంగ్‌డో జిల్లాకు చెందిన జిన్‌ పాన్‌ యామ్‌ గ్రామస్తులు. ఒకటి కాదు.. రెండు కాదు.. వీళ్లు 9 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌ పాతబస్తీలో నివసిస్తున్నారు.  ఎవరికీ అనుమానం రాకుండా వేర్వేరు చిరునామాలు సంపాదించి వివిధ సర్టిఫికెట్లు పొందారు. ఈ పరిణామం పోలీసుల్లోనే వణుకు పుట్టించింది. 


వాళ్లిద్దరి దగ్గర స్వాధీనం చేసుకున్న ధృవీకరణ పత్రాల్లో ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, మ్యారేజ్‌ సర్టిఫికెట్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, గ్యాస్‌ కనెక్షన్‌ సర్టిఫికెట్లు ఉన్నాయి. అంతేకాదు.. ఏకంగా భారత పౌరులుగా ఇక్కడ పాస్‌పోర్ట్‌ కూడా సంపాదించారు. మయన్మార్‌ పౌరులుగా వాళ్లు అక్కడ స్కూళ్లలో చదివిన ఐడీ కార్డులు కూడా పోలీసులు స్వాధినం చేసుకున్నారు. దీంతో, హైదరాబాద్‌లో ఇంకెంతమంది ఇలా.. రహస్యంగా రోహింగ్యాలు ఉంటున్నారో అన్నది అంతు పట్టడం లేదు.


Also Read:Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలుసా?


Also Read:Mulberry For Health: మల్బరీ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook