Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలుసా?

Tollywood Heroine Poorna Engagement. మలయాళీ నటి పూర్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ఈ విషయాన్నీ పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2022, 04:28 PM IST
  • హీరోయిన్ పూర్ణ ఎంగేజ్మెంట్
  • వరుడు ఎవరో తెలుసా?
  • సినిమాలకు గుడ్ బై చెబుతుందా? లేదో
Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలుసా?

Tollywood Heroine Poorna aka Shamna Kasim announces her engagement: 2007లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా వచ్చిన 'మహాలక్ష్మి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు 'పూర్ణ'.  అల్లరి నరేష్ సరసన 'సీమటపాకాయ్' సినిమాలో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును, అవును 2 చిత్రాలలో నటించి మెప్పించారు.  లడ్డుబాబు, మామ మంచు అల్లుడు కంచు, సిల్లీ ఫెల్లోస్, నువ్వలా నేనిలా, అవంతిక, పవర్ ప్లే  లాంటి సినిమాలు చేసినా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయారు. 

గత కొంత కాలంగా హీరోయిన్‌గా క్రేజ్ తగ్గడంతో.. 33 ఏళ్ల పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. దృశ్యం 2, తలైవి, అఖండ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. మరోవైపు టీవీ షోల్లోనూ పూర్ణ మెరుస్తున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారం అయ్యే 'ఢీ' డాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ.. చాలా ఫేమస్ అయ్యారు. ప్రియమణి, విజయ్ మాస్టర్‌తో కలిసి మూడో జడ్జిగా ఉన్నారు. స్వతహాగా డాన్సర్ అయిన పూర్ణ.. అప్పుడప్పుడు స్టేజిమీద డాన్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

మలయాళీ నటి పూర్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ఈ విషయాన్నీ పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. 'కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నా తదుపరి జీవితంలోకి అడుగుపెడుతున్నా. ఇప్పుడు మా బంధం అధికారికం' అని పేర్కొన్నారు. అంతేకాదు కాబోయే భర్తతో దిగిన ఫొటోను ఆమె షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది చుసిన అభిమానులు పూర్ణకు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. 

పూర్ణకు కాబోయే భర్త పేరు షానిద్ ఆసిఫ్ ఆలీ. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ ఆలీ. అతడు జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ ఎండీ అని సమాచారం తెలుస్తోంది. మొత్తానికి అరకొర అవకాశాలు దక్కించుకుంటున్న పూర్ణ.. బడా వ్యాపారవేత్తకు భార్య కాబోతోంది. పెళ్లి తరువాత ఈ మలయాళీ భామ సినిమాలకు గుడ్ బై చెబుతుందా? లేదో చూడాలి. 

Also Read: MS Dhoni Fan: ఎంఎస్ ధోనీ అంటే ఇదే.. అభిమానిని కలిసి కన్నీళ్లు తుడిచిన మహీ!

Also Read: అతడికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం.. అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్నాం: రషీద్‌ ఖాన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News