Mysterious Respiratory Virus Cases In Hyderabad: హైదరాబాద్‌ని పేరు తెలియని ఓ కొత్త విచిత్రమైన వైరస్ వణికిస్తోంది. " తెలంగాణకు పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో స్వైన్‌ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. హైదరాబాద్‌లో మాత్రం స్వైన్‌ఫ్లూ కేసులు అదుపులోనే ఉన్నాయి " అని వైద్యులు చెబుతున్నారు. డాక్లర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోన్న మరో అంశం ఏంటంటే.. నగరంలో తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత జబ్బులు పెరిగిపోతుండటం, అలాగే స్వైన్‌ఫ్లూ లక్షణాలను పోలి ఉన్నప్పటికీ వైద్య పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రాకపోవడం వారిని విస్మయానికి గురిచేస్తోంది. స్వైన్‌ఫ్లూ నెగటివ్ రావడంతో కొవిడ్ -19 టెస్ట్ చేయగా.. అందులోనూ నెగటివ్ రావడం మరింత ఆశ్చర్యం గొలుపుతోంది. మొత్తానికి ఏదో గుర్తు తెలియని వైరస్ రోగుల శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడేలా చేస్తోంది అని వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థల్లో ఈ రోగులకు స్వైన్‌ఫ్లూ, కొవిడ్-19, ఇన్‌ఫ్లూయెంజా A , ఇన్‌ఫ్లూయెంజా B వంటి పరీక్షలు చేయగా.. ఆయా వైద్య పరీక్షల్లో ఫలితం నెగటివ్ అనే వచ్చింది. దీంతో " స్వైన్‌ఫ్లూ లక్షణాలతో సోకుతున్న ఈ కొత్త వైరస్ ఏంటా " అని వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. 


గత రెండు లేదా మూడు నెలలుగా నగరంలో ఇదే సీన్ రిపీట్ అవుతోంది. నగరంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలకు సంబంధించి ఎన్నో కేసులు నమోదు అవుతున్నాయి. కానీ అవేవి స్వైన్‌ఫ్లూ కానీ లేదా కరోనావైరస్ కానీ లేదా ఇన్‌ఫ్లూయెంజా A , ఇన్‌ఫ్లూయెంజా B వైరస్‌లు కాకపోవడం అయోమయానికి గురిచేస్తోంది.  


" సాధారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, లో ఆక్సీజన్ లెవెల్స్ వంటి ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో బాధపడే వారికి పరీక్షలు చేస్తే స్వైన్‌ఫ్లూ కానీ లేదా కరోనావైరస్ పాజిటివ్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు " అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా ఎం రాజా రావు తెలిపారు. అందుకే ఇవి వేరొక వైరస్ అయ్యుండవచ్చని అనుమానిస్తున్నట్టు డా ఎం రాజా రావు సందేహం వ్యక్తంచేశారు. 


ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ డైరెక్టర్ డా పి శంకర్ సైతం ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. " కాకపోతే ఈ కొత్త వైరస్‌తో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదని.. ఎందుకంటే చికిత్స ప్రారంభించిన తరువాత ఐదు రోజుల్లోనే 100 శాతం నయం అవుతోంది " అని డా పి శంకర్ తెలిపారు. ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఈ వైరస్ మనుగడ కూడా అసాధ్యంగానే కనిపిస్తున్నందున ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 


ఇది కూడా చదవండి : Heart Problems In Youth: యువతను టెన్షన్ పెడుతున్న గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్స్


వైద్య నిపుణలు చెబుతున్న వివరాల ప్రకారం మనిషి శ్వాస వ్యవస్థపై ప్రభావితం చేసేలా దాదాపు 200 కు పైగా రకాల వైరస్‌లు ఉన్నాయని.. అందులో సార్స్‌తో సహా కలిపి అధికంగా కనిపించే వాటిలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు రైనోవైరస్‌లు, ఎంటరోవైరస్‌లు, కరోనావైరస్‌ రకాలు ఉన్నాయి కానీ ఇవేవి కూడా ఈ కేసులలో కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. దీంతో డాక్టర్లు సైతం దీనిని అంతుచిక్కని ఓ గుర్తుతెలియని మిస్టరీ వైరస్‌గానే పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త వైరస్ వైద్యుల మేధస్సుకు సవాల్ విసుతుంది అనే చెప్పుకోవచ్చు.


ఇది కూడా చదవండి : Side Effects of Eating Pears: వీళ్లు కానీ బేరిపండు తిన్నారో.. ఇక అంతే సంగతి !!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి