NAFFCO Investment in Telangana: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.700 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో (NAFFCO)  ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్ దుబాయ్ పర్యటనలో ఉండగా.. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి భారీ ఇన్వెస్ట్‌మెంట్‌తో పర్యటనను ప్రారంభించారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది నాఫ్కో కంపెనీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్, ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా 700 కోట్లు రూపాయల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది. తెలంగాణతో పాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని నాఫ్కో కంపెనీ పేర్కొంది.


తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్‌కు సరిపోతుందని తెలిపింది. దీంతోపాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ కోరారు. ఈ ప్రతిపాదనకు కూడా నాఫ్కో సంస్థ అంగీకారం తెలిపింది. ఈ శిక్షణ అకాడమీ ద్వారా దాదాపు 100 కు పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌కు తెలిపారు నాఫ్కో సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్.


Also Read: India World Cup 2023 Squad: సస్పెన్స్ వీడింది.. ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన


Also Read: RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook