తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకై రూపొందించిన ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలానికి సంబంధించిన జాబితాలో.. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తులకూ ఇప్పుడు ఓటు హక్కు కలించారు. అటు ఓ వార్డులోని వ్యక్తి పేరు మరో వార్డు జాబితాలో ఉండటం సహా కొందరి పేర్లు గల్లంతైనట్లు ఆరోపణలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బషీరాబాద్ మండలంలోని ప్రతి గ్రామంలో కనీసం పది శాతం మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. కానీ ఆ పేర్లపై రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపితే తొలగిస్తామని, లేదా వారి కుటుంబ సభ్యులెవరైనా చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ చూపిస్తే తొలగిస్తామని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. తొలగించే అధికారం కూడా కేవలం ఎమ్మార్వోలకు మాత్రమే ఉందని ఆ మండల ఎంపీడీఓ చెప్పారు.


ఇదిలా ఉండగా.. గతంలో 16 పంచాయతీలు ఉన్న తాండూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా 20 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో 220 జనాభా గల హంక్యా నాయక్‌ తండా ఓ  గ్రామపంచాయతీగా ఏర్పడింది.