Shamshabad Road Accident: శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ లీడర్ కుమార్తె మృతి!
Congress Leader Firoz khan Daughter Thaniya died. నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Congress Leader Firoz khan Daughter Thaniya died in Shamshabad Road Accident: టీపీసీసీ ముఖ్యనేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతంరాయి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానియా అక్కడికక్కడే మరణించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
శాతంరాయి వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి ఇంటికి వెళుతున్నారు. వేగంగా దూసుకొస్తున్న కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తానియా మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్టుకు వెళుతున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
[[{"fid":"239954","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
గాయపడిన వారికి వైద్య బృదం ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక టీపీసీసీ ముఖ్యనేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అంచనా వేస్తున్నారు. తానియా బ్యూటీషియన్‌గా పని చేస్తున్నాని సమాచారం తెలిసింది.
Also Read: Monkeypox Death: భారత్‌లో తొలి మంకీపాక్స్ మరణం.. కేరళలో కలకలం! పాజిటివ్ వచ్చినా చెప్పకుండా
Also Read: Harmanpreet Kaur: ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించిన హర్మన్‌ప్రీత్.. తొలి కెప్టెన్‌గా అరుదైన ఘనత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook