Balakrishna: తండ్రి ఎన్టీఆర్‌కు బాలకృష్ణ ఘన నివాళి
NTR Birth Anniversary | విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 97వ జయంతి నేడు.
తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాప్తి చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 97వ జయంతి (NTR Jayanti) నేడు. ఈ సందర్భంగా ప్రముఖులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు భార్య, కొందరు సన్నిహితులతో కలిసి వెళ్లి ఎన్టీఆర్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ‘జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు’
నివాళులు అర్పించిన అనంతరం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ సేవల్ని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని టీడీపీ నేతలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. బాలకృష్ణతో పాటు సోదరుడు రామకృష్ణ, సుహాసిని తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించారు. బికినీలో రెచ్చిపోయిన నటి.. అందాల ప్రదర్శన
[[{"fid":"186140","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న బాలకృష్ణ"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న బాలకృష్ణ"}},"link_text":false,"attributes":{"title":"ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న బాలకృష్ణ","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]
కాగా, లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తాత ఎన్టీఆర్ ఘాట్‌కు రావడం లేదని తెలిపారు. ఇంటి నుంచే దివంగత నేతకు నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అభిమానులు, పార్టీ నేతలు జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి