Mohan babu controversy: సీనియర్ నటుడు మోహన్​బాబు తమకు క్షమాపణలు చెప్పాలి నాయి బ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ఆయన వెంటనే తమ సామాజికవర్గానికి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్​తో హైదరాబాద్​లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద నిరసనలు తెలిపింది నాయి బ్రాహ్మణ సంగం. నిరసనల్లో మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు క్షమాపణలు చెప్పే వరకు ఎంత దూరమైనా వెళ్తామన్నారు. మున్ముందు తమ నిసనలు మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్షమాపణ ఎందుకు?


కొన్ని రోజులుగా మోనహ్​ బాబు మెకప్​ మెన్​ నాగ శ్రీను గురించిన వార్తలు మీడియాలో హల్​చల్ చేస్తున్న విషయం తెలిసింది. దాదాపు పదేళ్లుగా మోహన్​ బాబు, మంచు కుటుంబానికి మేకప్​మెన్​గా పని చేస్తున్న నాగ శ్రీను.. ఇటీవల ఆ కుటుంబంపై తీవ్ర తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. తనను కులంపేరుతో, తమ తల్లిని కలిపి బూతులు తిట్టారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై చాలా మంది.. స్పందించారు కూడా. మోహన్ బాబు లాంటి వ్యక్తి అలా కులం పెరుతో దూషణ చేయడం సరికాదని చెప్పారు.


నాగ శ్రీను తనకు జరిగిన అవమానాన్ని మీడియా ఎదుట చెప్పుకుని సహకరించాలని కోరాడు. దీనితో అతడికి తమ సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది మోహన్​ బాబుకు వ్యతిరేకంగా ఆరోపణలకు దిగుతున్నారు. తాజాగా నిరసనలు వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.



ఏదైనా సమస్య ఉంటే.. ఆ వ్యక్తితో మాత్రమే పరిష్కరించుకోవాలని అంతే కానీ ఆ వ్యక్తి సామాజిక వర్గాన్ని కించపరచడం ఏమిటి అని మండిపోడతున్నారు నాయి బ్రాహ్మణులు. భేషరతుగా నాయిబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పకపోతే తమ పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తామని స్పష్టం చేసింది నాయి బ్రహ్మణ సంఘం.


Also read: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం..!


Also read: Hindi Talent Test: హిందీ టాలెంట్ టెస్టులో సత్తా చాటిన కోరుట్ల విద్యార్థినులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook