Suicide: డాక్టర్ కావాలని కలలు కన్నది...నీట్లో ర్యాంకు రాలేదని ఉరేసుకుంది..
నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
NEET Student Suicide: తమ బిడ్డ డాక్టర్ కావాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కాయకష్టం చేసి చదివించారు. తను గొప్పస్థాయికి చేరుకుంటుందని ఆశించిన ఆ తల్లిదండ్రులకు... ఆ బిడ్డ తీవ్ర నిరాశను మిగిల్చి వెళ్లిపోయింది. నీట్(NEET EXAM-2021)లో సరైన ర్యాంకు లేదని మనస్తాపానానికి గురైన ఓ విద్యార్థి(NEET Student Suicide)ని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సంగారెడ్డి జిల్లా(Sangareddy District) మక్తకేసారానికి చెందిన సంజీవులు, యాదమ్మ దంపతులు బతుకుదెరువుకు నగరానికొచ్చి మియాపూర్(Miyapur) ఎంఏనగర్‌లో స్థిరపడ్డారు. కూలీ చేసుకుంటూ జీవనం సాగించే వీరికి ముగ్గురు పిల్లలు. పెద్దకుమార్తె సాయి లతకు చదువంటే ప్రాణం. వైద్యవిద్యను అభ్యసించాలన్నదే ఆమె కోరిక. అందుకే ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా.. ఓ కార్పొరేటు కళాశాలలో ఇంటర్ చదివించారు. ఓసారి నీట్‌కి శిక్షణ పొందినా సరైన ర్యాంకు రాలేదు.
Also read: Prabhas Fan Suicide: ప్రభాస్ ఫ్యాన్స్ సూసైడ్ నోట్ వైరల్.. ‘యూవీ క్రియేషన్స్ సంస్థే కారణం!’
ఈ ఏడాది కోచింగ్(Coaching) తీసుకుని పరీక్షకు హాజరు కాగా అనుకున్న ర్యాంకు రాకపోవడంతో మనోవేదనకు గురైంది. ఈ నెల 8న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య(Suicide)కు ప్రయత్నించింది. మదీనగూడలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. చదువులో చురుగ్గా ఉండే సాయిలత మృతి పట్ల స్థానికులు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఏఎస్సై రవీందర్ తెలిపారు. విద్యార్థులు(Students) క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. మరోసారి ప్రయత్నించి ఇతర కోర్సుల్లో చేరాలని పోలీసులు(Police) సూచించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన నీట్ పరీక్ష(NEET)ను అడ్డుకునేందుకు మద్దతు కూడగడుతున్నారు తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్(Tamil nadu CM Stalin). విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండేలా చూడడంలో సహకారం అందించాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook