Nethanna Bima: చేనేతకు పెద్దపీట వేస్తున్నాం..7న అద్భుత పథకం తీసుకొస్తున్నామన్న కేటీఆర్..!
Nethanna Bima: తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని శ్రీకారం చుట్టబోతోంది. ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న బీమా పథకం ప్రారంభించనున్నారు.
Nethanna Bima: చేనేత రంగానికి కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేస్తోంది. ఇందులోభాగంగా ఈనెల 7న బృహత్కర కార్యక్రమం చేపట్టబోతోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నూతన బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా చేనేత కార్మికులకు బీమా పథకం తీసుకురాబోతున్నారు. రైతు బీమా మాదిరే నేతన్నకు బీమా అందనుంది.
రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు పథకానికి అర్హుడు కానున్నాడు. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల బీమా పరిహారం అందనుంది. నేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేత కార్మికులకు బీమాతో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్గుతుందన్నారు.
నేతన్నల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఈసందర్భంగా ఆయన ప్రస్తావించారు. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇందులోభాగంగా ఈపథకాన్ని తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందనుందని తెలిపారు.
లబ్ధిదారులు చనిపోయిన పది రోజుల్లోనే సాయం మొత్తం జమం అవుతుందని చెప్పారు. ఈపథకం అమలుకు చేనేత, జౌలి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. నేతన్న బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ఒప్పందం చేసుకుందన్నారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత, పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని ఎల్‌ఐసీకి చెల్లిస్తుందన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించామని..ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. చేనేత రంగానికి గతంలోఎన్నడూ లేనివిధంగా 2016-17 వార్షిక బడ్జెట్‌లో 12 వందల కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని..ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి అధికార బృందాలు వచ్చి అధ్యయనం చేశామని తెలిపారు.
Also read:Cooch Behar: పవిత్ర జలం కోసం వెళ్తుండగా ఘోర ప్రమాదం, కరెంట్ షాక్ తో 10 మంది శివ భక్తులు మృతి
Also read:BJP: తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం..జేపీ నడ్డా, అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook