Cooch Behar: పవిత్ర జలం కోసం వెళ్తుండగా ఘోర ప్రమాదం, కరెంట్ షాక్ తో 10 మంది శివ భక్తులు మృతి

Cooch Behar: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్‍బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికుల బస్సుకు కరెంట్ షాక్ తగిలింది.ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు చనిపోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కు విద్యుదాఘాతానికి గురి కావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Written by - Srisailam | Last Updated : Aug 1, 2022, 01:40 PM IST
  • బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
  • శివయాత్రికుల బస్సుకు కరెంట్ షాక్
  • 10 మంది భక్తులు దుర్మరణం
Cooch Behar: పవిత్ర జలం కోసం వెళ్తుండగా ఘోర ప్రమాదం, కరెంట్ షాక్ తో 10 మంది శివ భక్తులు మృతి

Cooch Behar: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్‍బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికుల బస్సుకు కరెంట్ షాక్ తగిలింది.ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు చనిపోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కు విద్యుదాఘాతానికి గురి కావడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 16 మంది యాత్రికులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం జల్పాయ్‌గురి జిల్లా ఆసుపత్రికి తరలించారు. యాత్రికులు వెళుతున్న ట్రక్కులో డీజే సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే కరెంట్ షాక్ తగిలిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.యాత్రికుల వాహనం జల్పేష్ వెళ్తుండగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వ్యానులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వాహనాన్ని సీజ్ చేశారు. ప్రమాదం తర్వాత వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. మేఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్లా బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు మఠభంగ అడిషనల్ ఎస్పీ అమిత్ వర్మ తెలిపారు. జనరేటర్ వైరింగ్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారితో పాటు గాయపడిన కన్వారియాలందరూ శీతల్‌కుచి  ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించామని ఎస్పీ అమిత్ వర్మ చెప్పారు.మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు.

గంగా నది పవిత్ర జలం కోసం ప్రతి ఏటా శివభక్తులు వెళుతుంటారు. కన్వరీలతో యాత్ర చేపట్టే శివుని భక్తులను కన్వరియాలు అంటారు. ప్రతి ఏటా వీళ్లు కన్వరియాత్రలో పాల్గొంటారు. ఈ యాత్రికుల బస్సే విద్యుదాఘాతానికు గురైంది.

Read also: Weight Loss Tips: రోజూ ఉదయం బ్రేక్‌ ఫస్ట్‌లో మల్టీ గ్రైన్‌ బ్రెడ్‌ తీసుకుంటే  10 రోజుల్లో బరువు తగ్గుతారు..!

Read also: TDP MLA: పేపర్ బాయ్ గా టీడీపీ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News