Netizens Target IT Minister KTR Over Hyderabad Floods: హైదరాబాద్ లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్గాలతో నగరం నరకప్రాయంగా మారుతోంది. రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయింది. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. వరద పోటెత్తడంతో వందలాది కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్ని చెరువులుగా మారిపోవడంతో వాహనదారులు నరకం చూశారు. అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ రోడ్లన్ని వరదతో నిండిపోవడంతో నగరవాసులు నరకం చూశారు. ప్రతి ఏటా ఇలానే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నాలాలను క్లీన్ చేయకపోవడంతోనే వరద కాలనీలను ముంచేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లోని వరద పరిస్థితులపై సోషల్ మీడియాలో #twittertillu హ్యాష్ టాగ్ తో నెటిజన్లు తమదైన శైలిలో పోస్టులు పెట్టారు. కేటీఆర్ ను నిలదీశారు. ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం మానేసి సమస్య పరిష్కారంపై ఫోకస్ చేయాలని సూచించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ పరిస్థితి ఇది అంటూ విమర్శలు చేశారు.



పీవీ ఎక్స్ ప్రెస్ వే మార్గంలో వరద బీభత్సం స్పష్టించింది. రోడ్లపైకి మనిషి మునిగిపోయేంత ఎత్తులో నీరు చేరింది. పెద్ద పెద్ద వాహనాలు కూడా మునిగిపోయాయి. దీంతో అత్తాపూర్ రూట్ లో అర్ధరాత్రి వరకు రోడ్డు క్లోజ్ అయింది. మున్సిపల్ శాఖ మంత్రి ఇందుకు బాధ్యత వహించాలని కొందరు డిమాండ్ చేశారు.



Also Read : Telangana BJP: పదవులు వద్దంటూ హైకమాండ్ కు లేఖలు.. తెలంగాణ బీజేపీలో కలకలం


Also Read : Hyderabad Rain Alert: కుండపోత వానతో హైదరాబాద్ జలమయం.. మరో రెండు రోజులు డేంజరే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి