హైదరాబాద్: తెలంగాణలో వరుసగా మూడో రోజు కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలతో అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక లెక్కల ప్రకారం సోమవారం మధ్యాహ్న సమయానికి రాష్ట్రంలో కొత్తగా మరో 69 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. 


కాగా హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి పరిధిలో 63 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో ఆరు నమోదైనట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1265కు చేరిందని, ఇప్పటివరకు 30 మంది కరోనా బారినపడి మరణించారని తెలిపారు. మరోవైపు కరోనా బాధితులు వేగంగా కోలుకుంటుంటున్నారని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 750 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. ప్రస్తుతం 385 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి నుండి రక్షించుకునేందుకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..