criminal case has been registered against mla padi Kaushik reddy: తెలంగాణలో ఇప్పటికే రాజకీయాలు హట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ నుంచి వరుసగా కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను విమర్శిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ బుక్ అనేది హట్ టాపిక్ గా మారింది.  అవినీతికి పాల్పడిన అధికారులు, రాజకీయ నేతల అక్రమాలను బ్లాక్ బుక్ లో ఎంటర్ చేస్తున్నామంటూ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్లాక్ బుక్ లో మొదటి పేరు మంత్రి పొన్నం ప్రభాకర్ దే అంటూ చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Heart stroke: విధుల్లో ఉండగా గుండెపోటు.. కుప్పకూలీన 30 ఏళ్ల బ్యాంక్ ఉద్యోగి.. వీడియో వైరల్..


బీఆర్ఎస్ అధికారంలోకి  రాగానే ఆయన అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. ఇదిలా ఉండగా..ఇటీవల కేంద్ర కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది. బ్రిటిష్ పాలన కాలంలో నుంచి ఉన్న పాత చట్టాలను తీసేసి, వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది. భారత్ న్యాయ సంహిత యాక్ట్ దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చినే రెండోరోజు పోలీసులు కేసు నమోదు చేశారు.


బీఎన్ఎస్ యాక్టులో పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ అమలులోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. నిన్న (మంగళవారం) జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై జెడ్పీ సీఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నుంచి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అధికారులను అడ్డుకుని బైఠాయించారు. అంతేకాకుండా అధికారుల విధులకు ఆటంకం కలిగే విధంగా పనులు చేశారు. ఈ క్రమంలో..జెడ్పీ సీఈవో పోలీసులకు  ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.



అసలేం జరిగిందంటే...


నిన్న (మంగళవారం) జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రచ్చ సృష్టించారు. ఇటీవల హుజురాబాద్‌ నియోజకవర్గంలో విద్యారంగానికి సంబంధించి సమావేశం జరిగింది. దీనిలో  ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి హాజరైన ఎమ్‌ఈవోలను డీఈవో బదిలీ చేయడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే డీఈవోను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.


ఈ నేపథ్యంలో..దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని కౌశిక్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి, తమ నియోజక వర్గంలో షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి ఇచ్చే చెక్ లను అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పలుమార్లు విమర్శలు చేశారు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.


Read more: Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..


కలెక్టర్‌ను వెళ్లనీయకుండా ఎమ్మెల్యే అడ్డుకుని అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఘటనపై జెడ్పీ సీఈవో అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి