Telangana Govt: తెలంగాణ మండలికి కొత్త భనవం.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం..
Telangana Govt: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు దాదాపు దశాబ్దం తర్వాత హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇక తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర ఉండేలా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త అసెంబ్లీకి అనుబంధంగా మండలి భవనాన్ని కొత్తగా నిర్మించాలనే ఆలోచన చేస్తోంది.
New Assmembly:తెలంగాణ కొలువు తీరిన రేవంత్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ భవనాన్ని ఆనుకొని మండలికి కొత్త భవనం నిర్మించాలనే ఆలోచన చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కారు. తెలంగాణ రాజసం ఉట్టిపడేలా ఈ నిర్మాణం వుండాలని భావిస్తోంది. ఇప్పటికే గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పాలనా వ్యవస్థలపై తనదైన ముద్ర వేసారు. హైదరాబాద్ రూపు రేఖలు మార్చారు. దాదాపు హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫ్లై వోవర్లు.. అండర్ పాస్ లతో పాటు.. కాళేశ్వరం, మల్లన్న సాగర్ తో పాటు పలు అభివృద్ది పనులతో హైదరాబాద్ సహా తెలంగాణలో జిల్లాల రూపు రేఖలు మార్చివేసారు.
మరోవైపు ఒకపుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్.. ఆ తర్వాత తెలంగాణ సెక్రటేరియట్ భవవాన్ని వాస్తు బాగోలేదంటూ కూల్చి వేసి రాజసం ఉట్టి పడేలా కొత్త భవనాన్ని నిర్మించారు. మరోవైపు మహిళల భద్రత కోసం షీ టీమ్స్, మెడికల్ హబ్ లతో పాటు.. మెట్రో ప్రాజెక్ట్ ఇలా హైదరాబాద్ పై తనదైన ముద్ర వేసారు కేసీఆర్. ఇపుడు ఆయన బాటలోనే రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చంద్రబాబు అప్పట్లో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మించి హైదరాబాద్ నగరంలో ఐటీకి కొత్త బాటలు వేసారు. ఇపుడు రేవంత్ సర్కారు.. శంషాబాద్ దగ్గర ఫోర్త్ సిటీకి రంగం సిద్ధం చేస్తున్నారు. హైడ్రాతో నగరంలో కనుమరుగైన చెరువులను, కుంటలను కాపాడేందుకు నడుం బిగించారు. మరోవైపు మెట్రో విస్తరణ పనులు చేపట్టి నగరంపై తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న జూపార్క్ ను తరలించడంతో పాటు.. దామగుండంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు వంటి పనులతో తనదైన ముద్ర వేసే పనిలో పడ్డారు రేవంత్ రెడ్డి.
అదే తరహాలో తెలంగాణ మండలికి కొత్త భనవం నిర్మించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. నిజాం నిర్మించిన భవనం తరహాలోనే.. రాజసం ఉట్టిపడేలా మండలి కొత్త భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు. ఈ పునర్నిర్మాణ పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు.
ముఖ్యంగా పార్లమెంట్ సెంట్రల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఒకే దగ్గర ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం.. అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వెళ్లాలంటే.. వాహనాలు ఉపయోగించాల్సి వస్తోంది. రెండు భవనాలు ఒకే దగ్గర ఉంటే సమయం ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter