Hyderabad: నగరంలో న్యూ ఇయర్ వేడులపై నిషేధం: సీపీ సజ్జనార్
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
New Year Celebrations Ban in Hyderabad | హైదరాబాద్: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డిసెంబరు 31వ తేదీన ఎలాంటి ఈవెంట్స్‌కు, పబ్‌లు, క్లబ్బులు, బార్లకు పర్మిషన్ లేదని సజ్జనార్ (VC Sajjanar) వెల్లడించారు. స్టార్ హోటళ్లల్లో రోజువారీ కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
కరోనా కారణంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిలిపివేశామని.. ఈ రోజు నుంచి విస్తృతంగా నిర్వహిస్తామని (Cyberabad Police Commissioner Sajjanar ) వెల్లడించారు. దీని గురించి ఇప్పటికే పోలీసులకు ఆదేశాలను జారీ చేశామని వెల్లడించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని (Cyberabad Police) సీపీ సజ్జనార్ కోరారు. Also Read: Vaikuntha Ekadashi: వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
కొత్తరకం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని పలుచోట్ల ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో యూకే (UK) నుంచి వచ్చిన వారిని ట్రేసింగ్ చేయడంతోపాటు.. వారికి కరోనా (Coronavirus) నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. Also Read: New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు కరోనా వైరస్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook